స్టార్ హీరోయిన్ నుంచి రూ.2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి!
ఒకప్పుడు అబ్బాయిల కలల రాకుమారి అయిన ఈ నటి 15 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలో హిట్ అందుకుంది. రజనీకాంత్, చిరంజీవి, కృష్ణ, వెంకటేష్, బాలకృష్ణ, విజయ్, అజిత్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించింది. తక్కువ కాలంలోనే అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. ఆమె ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. దాదాపు రూ.2000 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఆ నటి మళ్లీ సినిమాల్లోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఆ అందాల భామ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి, ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి రంభ. ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు పేరు యీది విజయలక్ష్మి:
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన రంభ అసలు పేరు యీది విజయలక్ష్మి. ఆమె తన 15వ ఏట స్కూల్‌లో జరిగిన ఒక నాటకంలో 'దేవి అమ్మవారు' పాత్ర పోషించి సినీ దర్శకుల దృష్టిని ఆకర్షించారు. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 1992లో మలయాళ దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో వచ్చి 'సర్గం' సినిమాతో ఆమె తన జీవితాన్ని ప్రారంభించారు.
భాష తెలియకపోయినా సక్సెస్
మలయాళ భాష ఒక్క ముక్క కూడా తెలియకపోయినా 'సర్గం' సినిమాలో తన పాత్రకు జీవం పోసి ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఆమెను అమృత అనే పేరుతో పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగు సినీ రంగ ప్రవేశంతో ఆమె పేరు రంభగా మారింది. తెలుగు తెరకు 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ద్వారా పరిచయమైంది. ఈ పేరుతోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అన్ని భాషల్లోనూ నటించి, నిర్మాతగా కూడా..
రంభ తన సినీ జీవితంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హిందీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన 'బంధన్' చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటిగా మాత్రమే కాకుండా, 2003లో 'త్రీ రోజెస్' సినిమాతో నిర్మాతగా కూడా మారారు.2010లో రంభ కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుని టొరంటోలో స్థిరపడ్డారు. వారికి లావణ్య, సాషా, శివిన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2011లో వచ్చిన మలయాళ సినిమా 'ది ఫిల్మ్‌స్టార్' ఆమె చివరి చిత్రం.
రూ.2000 కోట్లకు అధినేత్రి
రంభ ఇప్పుడు తన భర్త వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. వారి కంపెనీ 'మ్యాజిక్ వుడ్స్'తో పాటు మొత్తం ఐదు కంపెనీలకు వారు యజమానులు. సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రంభ, ఆమె భర్త మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.2000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ విధంగా ఆమె సినీ జీవితంలోనే కాకుండా, వ్యాపార రంగంలో కూడా గొప్ప విజయం సాధించారు.












Click it and Unblock the Notifications