సినిమాలు కావు.. పక్కా రియల్!: దేశాన్ని వణికించిన టాప్ 5 క్రైమ్ డాక్యుమెంటరీలు!

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్న సమయంలో ప్రేక్షకులు ఎంతో థ్రిల్ అవుతుంటారు. గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఫిక్షన్ స్టోరీల కంటే నిజజీవితంలో జరిగిన దారుణమైన నేరాలు, మిస్టరీలు, సీరియల్ కిల్లర్ల నేరాలకు సంబంధించిన సీన్లు గూస్‌బంప్స్ కలిగిస్తాయి. నిజమైన దర్యాప్తు స్టోరీలు, విచారణ అధికారుల అనుభవాలతో తెరకెక్కిన డాక్యుమెంటరీలు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో రూపొంది ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టాప్ 5 బెస్ట్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.

1. ద బుచ్చర్ ఆఫ్ ఢిల్లీ(The Butcher of Delhi)
ఇండియాను వణికించిన ఓ భయంకరమైన సీరియల్ మర్డర్ కేసు ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతంలో నిందితుడు పోలీసులకే ఛాలెంజ్ విసురతూ డెడ్ బాడీల భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసేవాడు. నేర ప్రదేశంలో నేరస్థుడు వదిలిన చిన్న చిన్న క్లూస్ ఆధారంగా పోలీసులు ఆ నిందితుడి నెట్వర్క్‌ను ఎలా ఛేదించారు.. చివరకు ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నారనే విషయాలను ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సిరీస్‌లలో ఇది తొలి స్థానంలో నిలుస్తుంది.

Top 5 Best True Crime Documentary Series in India You Must Watch for Crime Investigation Lovers

2. బీస్ట్ ఆఫ్ బెంగళూరు(Beast of Bengaluru)
బెంగళూరు నగరాన్ని ఒకానొక సమయంలో తీవ్ర భయాందోళనకు గురిచేసిన క్రూరమైన సీరియల్ సైకో కిల్లర్ కేసు ఆధారంగా ఆ డాక్యుమెంటరీ తెరకెక్కింది. రాత్రివేళల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా సాగిన ఈ నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, అతడి మానసిక స్థితి ఎలాంటిది అనే విషయాలను పోలీసులు ఎలా గుర్తించారనే విషయాన్ని ఈ సిరీస్ లో చూపించారు. విచారణాధికారికి ఎదురైన సవాళ్లు, నిజమైన కేసు ఫైళ్లతో ప్రతి నిమిషం ఉత్కంఠగా నడిచేలా దీనిని రూపొందించారు.

3.హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్(House of Secrets: The Burari Deaths)
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు అనుమానాస్పద స్థితిలో శవాలై తేలిన ఘటన అప్పట్లోదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది హత్యా లేక మూఢనమ్మకాలతో చేసుకున్న ఆత్మహత్యా అనే కోణంలో సాగిన పోలీసుల దర్యాప్తును డాక్యుమెంటరీ రూపంలో కళ్లకు కట్టేలా రూపొందించారు. ఈ కేసుకు సంబంధించిన అసలైన సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలు, సైకాలజిస్టులు, నిపుణుల అనాలిసిస్ తో మిస్టరీని విప్పిన తీరు ప్రేక్షకారణ పొందింది.

4. ఇండియన్ ప్రిడేటర్: డైరీ ఆఫ్ ఎ సీరియల్ కిల్లర్(Indian Predator: Diary of a Serial Killer)
దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన మరొక సీరియల్ కిల్లర్ విచారణ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. నిందితుడి వద్ద లభించిన ఓ డైరీ ఆధారంగా వెలుగులోకి వచ్చిన దారుణాలు, దర్యాప్తు అధికారులను కూడా ఆశ్యర్యానికి గురిచేసే నిజాలు ఈ సిరీస్ ప్రత్యేకత. షాకింగ్ ట్విస్టులు, ఉత్కంఠభరిత స్టోరీతో ప్రతి ఎపిసోడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

5.ది హంట్ ఫర్ వీరప్పన్(The Hunt For Veerappan)
భారత నేర చరిత్రలో ఓ మనిషిని పట్టుకోవడం కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలను వెచ్చించి మరీ వెతికిన స్టోరీ ఇది. గంధపు చెక్కల స్మగ్లర్, ఎన్నో హత్యలకు కారణమైన వీరప్పన్‌ను పట్టుకోవడానికి తమిళనాడు, కర్ణాటక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బలగాలు ప్రయోగించిన వ్యూహాలేంటి? అడవుల్లో సాగిన ఈ ఆపరేషన్ ముగింపుకు ఎలా వచ్చింది? అనే విషయాలను ప్రతి ఎపిసోడ్‌లోనూ ఎంతో ఉత్కంఠను కలిగించేలా రూపొందించారు.

ఫిక్షన్ కథల కంటే. నిజంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు, సీరియల్ కిల్లర్లు, పోలీసుల విచారణలు మీకు ఎక్కువ థ్రిల్ ఇస్తే ఈ టాప్ 5 రియల్ క్రైమ్ డాక్యుమెంటరీలు తప్పకుండా చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+