దేశవ్యాప్తంగా నిరసనలపై కాక్రోచ్ పార్టీ సంచలన ప్రకటన..! కేంద్రం వరుస నిర్ణయాలతో..!

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్దులపై కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విద్యార్ధి నిరసనలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న నిరసనలను విరమించుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 49 రోజులుగా చేపట్టిన ఆందోళనను కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా విరమించుకుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సహా ప్రభుత్వ ప్రతినిధులతో సీజేపీ ప్రతినిధి బృందానికి మధ్య మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

CJP Withdraws Students Parliament Protest After Pradhan Steps Down Govt Agrees to Demands

చర్చల అనంతరం సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం అంగీకరించిన నిబంధనలను వాగ్దానం చేసిన కాలపరిమితిలోగా అమలు చేస్తుందనే ఆశతో, సద్భావనతోనే ఈ ఆందోళనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో తమ మొదటి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించినట్లు సీజేపీ తెలిపింది. తర్వాత ఎక్స్ లో చేసిన పోస్ట్ లో నిరసనల ఉపసంహరణ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ అంగీకరించిన తర్వాత, తమ దేశవ్యాప్త ఆందోళనను తక్షణమే ముగిస్తున్నట్లు పేర్కొంది. తమ ఐదు సూత్రాల పరీక్షా సంస్కరణల చార్టర్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఇరుపక్షాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని కూడా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+