పోతారు... మొత్తం పోతారు: 'గేమ్‌ఛేంజర్'పై ఎస్.జె.సూర్య
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా సినిమాగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కియారా అద్వానీ కథానాయికగా నటించగా ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో విడుదలైన పుష్ప ట్రైలర్ సూపర్ హిట్ అయింది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ అంతకుమించి హిట్ అవ్వాల్సిన బాధ్యత దర్శకుడు శంకర్ పై ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు కొంతకాలం విరామం ఇచ్చి ఆయన రూపొందించిన భారతీయుడు2 ఇండియాలోనే అత్యంత చెత్త డిజాస్టర్ సినిమాగా నిలిచింది.
భయపడుతున్న మెగా అభిమానులు
దీంతో మెగా అభిమానులంతా భయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి ట్రైలర్ ఈవెంట్ ను ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. తాజాగా లక్కోలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ కార్యక్రమంలో మాట్లాడమని ఎస్.జె.సూర్యను కోరగా ఆయన మైక్ తీసుకొని పోతారు.. అంతా పోతారు అన్నారు. ఇది నాని కథానాయకుడిగా నటించిన సరిపోదా శనివారం సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఈ సినిమా ఉత్తరాదిలో విడుదలైనా పెద్ద హైప్ రాలేదు. నానికన్నా ప్రేక్షకులు ఎస్.జె.సూర్య విభిన్నమైన నటననే ఇష్టపడ్డారు. తాజాగా మరోసారి ఆ సినిమాను ఉత్తరాదిలో గుర్తుచేశారు.

అదిరిపోయే స్పందన వస్తుంది
గేమ్ ఛేంజర్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, వాటికి అదిరిపోయే స్పందన వస్తుందని సూర్య అన్నారు. అలా చెబుతూ పోతారు.. మొత్తం పోతారు అనే డైలాగును ఉపయోగించారు. సరిపోదా శనివారం సినిమా ప్రభావం నానికన్నా సూర్యపైనే ఎక్కువగా ఉంది. సూర్య ఎక్కడకు వెళ్లినా ఈ సినిమాలోనే డైలాగులనే చెబుతున్నారు. రామ్ చరణ్ తో, శ్రీకాంత్ తో ఉన్న సీన్ల డబ్బింగ్ పూర్తిచేయడానికి తనకు మూడురోజులు పట్టిందని ఎస్.జె.సూర్య చెప్పారు. పుష్ప2 సినిమాను అంతర్జాతీయంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. దానిపై పై చేయి సాధించాలంటే అంతకు మించి విడుదల చేయాలి.. లేదంటే దాంతో సమానంగానైనా విడుదల చేయాలి. ఆ బాధ్యత నిర్మాత దిల్ రాజుపై పడింది. ఆయన ఎటువంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications