మహేశ్ బాబు నివాసంలో గణేష్ నిమజ్జన వేడుకలు: గౌతమ్, సితార ఇలా (వీడియో)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నివాసంలో కూడా గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపారు. వినాయక చవితి పండగ రోజున మహేశ్ కూతురు సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మహేశ్ సతీమణి నమ్రత తమ కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్న వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా, వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిమజ్జనం నిర్వహించారు. ఈ నిమజ్జన ఉత్సవాలలో మహేశ్ బాబు కుమారుడు గౌతమ్, సితార పాల్గొని సందడి చేశారు.

తమ ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని తమ ఇంట్లో పనివాళ్లతో కలిసి తీసుకువచ్చారు. ఆ తర్వాత సితారతో కలిసి వినాయక విగ్రహాన్ని ఓ డ్రమ్ములోని నీటిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, నమ్రతలు పాల్గొనలేదు. కాగా, వినాయకుడి విగ్రహాన్ని గౌతమ్ ఎత్తుకుని వచ్చి.. తమ ఇంటి పెరట్లో ఏర్పాటు చేసిన డ్రమ్ములో నిమజ్జనం చేశారు.
ఈ నిమజ్జనం వీడియోను నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంటూ గణపతి బప్పా మోరయా అంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన మాతృభాష మరాఠీలో ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ రాసుకువచ్చారు. ప్రస్తుతం మహేశ్ ఇంట్లో వినాయక విగ్రహ నిమజ్జనంకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, హైదరాబాద్ నగరంలోనూ గణనాథుల నిమజ్జనాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications