పవన్ "ఓజీ" ఫ్యాన్స్‌కి డబుల్ బొనాంజా.. ఇక మోత మోగిపోద్ది !!

ఎప్పుడెప్పుడా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న "ఓజీ" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే "ఓజీ" ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్‌ను మరోసారి నిరూపిస్తోంది. పవన్ ను ఇలా చూడాలని ఆశపడ్డ ఫ్యాన్స్ అందరినీ ఫుల్ ఖుషీ చేసింది. పవర్ స్టార్ యాక్టింగ్, సుజీత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ కలిసి థియేటర్లు వణికించేలా చేస్తున్నాయి.

బ్లాక్‌బస్టర్ టాక్..

ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించగా, డైరెక్టర్ సుజీత్ పవన్‌ను పూర్తిగా న్యూ అవతార్‌లో చూపించారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో "ఫుల్ మీల్స్", "పవన్ మాస్ రాంపేజ్" అంటూ ఫ్యాన్స్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు.

good-news-for-pawan-kalyan-og-movie-lovers-that-special-song-added-in-movie

స్టార్ కాస్ట్..

ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా గ్లామర్, నటనతో మెప్పించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అలాగే శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన సౌండ్‌ట్రాక్ సినిమాకి మాసివ్ హైప్ తీసుకువచ్చింది. BGM ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా..

సినిమా రిలీజ్ అయిన వెంటనే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు ఫిర్యాదులు చేశారు. తాజాగా ప్రభుత్వం రేట్లు తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో మళ్లీ ఆడియన్స్ థియేటర్లవైపు తిరిగి వచ్చే అవకాశం ఉంది. రిపీట్ ఆడియన్స్ కూడా రావడం వల్ల కలెక్షన్లు ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అదే కాకుండా, సినిమాలో ఉన్న నేహా శెట్టి స్పెషల్ సాంగ్ మొదట్లో తొలగించగా, ఇప్పుడు దానిని మళ్లీ యాడ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా లభించినట్టేనని చెబుతున్నారు.

"ఓజీ" ప్రీక్వెల్ ప్లాన్..

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ సుజీత్.. ఓజీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ సిద్ధమవుతోందని తెలిపారు. సుభాష్ చంద్రబోస్ ఇండియా నుండి ప్రజలను జపాన్ కి ఎలా తీసుకెళ్లాడు? ఆ కాలంలో ఏం జరిగింది? అనే అంశాలను చూపించేలా కథ ఉంటుందని చెప్పారు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్‌లో కొత్త ఎగ్జైట్‌మెంట్ రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+