AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-అమరావతి రైతుల నుంచి NIA కోర్టు వరకూ..!

ఏపీలో ఇవాళ సమావేశమైన కేబినెట్ (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఎన్ఐఏ కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా, సెషన్స్ జడ్జి స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అధికార పరిధి కలిగిన ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ ప్రాతిపదికపై జీతాలు చెల్లించేలా 16 పోస్టులను మంజూరు చేసేందుకు కూడా మంత్రి మండలి ఆమోదించింది. రాజధానిలో LPS భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే కౌలును పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!
Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!

రాజధానిలో మెట్ట భూములకు ఎకరానికి రూ.30వేలు నుండి 40 వేలకు, జరీబు భూములకు ఎకరానికి 50 వేలు నుండి 60 వేలకు పెంచాలి నిర్ణయించారు. అలాగే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాల ఏడు గ్రామాల్లో రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి, పథకం అమలుకు మార్గదర్శకాలను రూపొందించడానికి సీఆర్డీయే కమిషనర్ కు అనుమతిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీలో కచేరీలు, కన్సర్ట్‌ల నిర్వహణ, ప్రోత్సాహానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

AP Cabinet Takes Key Decisions Social Media Crackdown Amaravati Farmers Annuity Hike NIA Court in Vizag
వాణిజ్య LPG సిలెండర్ పై జీఎస్టీ తగ్గింపు ? ఏపీ హోటళ్ల డిమాండ్ ..!
వాణిజ్య LPG సిలెండర్ పై జీఎస్టీ తగ్గింపు ? ఏపీ హోటళ్ల డిమాండ్ ..!

రాష్ట్రంలో పలు జిల్లాల్లో స్టార్ హోటల్, ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్ మెంట్ ప్రాజెక్టులకు, పరిశ్రమల విస్తరణలకు, భూకేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో అనంతపురం, మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ ఆఫీసుల కోసం భూకేటాయింపులు కూడా ఉన్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో IIT-JEE, NEET పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా మేఘాద్రిగడ్డ,గుంటూరు జిల్లా తాడికొండ, నెల్లూరు జిల్లా కోటలో అంబేద్కర్ గురుకులాల పేరుతో 3 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+