దండం పెడతాం అడ్డుకోండి సారూ.. ట్రంప్ ముందుకు ఊహించని విజ్ఞప్తి!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం, సాంకేతిక పురోగతి మునుపెన్నడూ లేని విధంగా వేగంగా పెరుగుతోంది. ఈ వేగవంతమైన వృద్ధి సమాజ భద్రతకు సవాలుగా మారుతోందని టెక్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలో ఏఐ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నిపుణలు మరోసారిపై దానిపై హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ, టెక్నాలజీ కంపెనీలకు చెందిన 1100 మందికి పైగా ఉద్యోగులు, ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మెటా, గూగుల్ వంటి అగ్రగామి ఏఐ కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు, సైంటిస్టులు, ఇంజనీర్లు సంతకం చేసిన ఓ బహిరంగ లేఖను ట్రంప్ ప్రభుత్వానికి సమర్ఫించారు. ఈ విషయంలో వారు మాట్లాడుతూ.. ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, కానీ దాని భద్రత, పర్యవేక్షణకు సంబంధించిన నియమాలను అదే వేగంతో రూపొందించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించేందుకు వీలుగా ఓ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం ఇతర దేశాలతో కలిసి పనిచేయాలని ఉద్యోగులు కోరారు.

1 100 Artificial Intelligence Experts Urge Donald Trump to Slow Down AI Development Speed

భద్రతా వలయాన్ని ఛేదించిన ఏఐ మోడల్స్
ఇటీవల చోటుచేసుకున్న ఓ తీవ్రమైన సంఘటన ఆందోళనలకు ప్రధాన కారణంగా నిలిచింది. పరీక్షల సమయంలో రెండు ఏఐ నమూనాలు భద్రతను ఉల్లంఘించి, బహిరంగ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడమే కాకుండా, మరో కంపెనీ అంతర్గత వ్యవస్థలలోకి కూడా చొరబడ్డాయని గత వారం ఓపెన్ఏఐ వెల్లడించిన తర్వాత ఈ విజ్ఞప్తి వచ్చింది. ఈ సంఘటన ఏఐ భద్రతపై కొత్త ఆందోళనలను రేకెత్తించింది.

ఆందోళన వ్యక్తం చేసిన సామ్ ఆల్ట్‌మాన్
ఏఐ సామర్థ్యాలు ఇదే వేగంతో పెరుగుతూ పోతే దానిని అర్థం చేసుకోవడం, నియంత్రించడం మానవులకు కష్టతరం కావచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల, భద్రతా చర్యలను పటిష్టం చేసుకోవడానికి పరిశ్రమ, ప్రభుత్వం, సమాజానికి సమయం ఇవ్వాలి. సమాజం, ప్రభుత్వాలు ఈ కొత్త సాంకేతికతకు అలవాటు పడటానికి వీలుగా, ఏఐ అభివృద్ధి వేగాన్ని కొంతకాలం తగ్గించాల్సి రావచ్చని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా పేర్కొన్నారు.

ఏఐ అభివృద్ధిని సకాలంలో సమర్థవంతంగా పర్యవేక్షించకపోతే, అది దుర్వినియోగం, సైబర్ దాడులు, తప్పుడు సమాచారం, కీలక మౌలిక సదుపాయాలకు ముప్పు పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు ఆ లేఖలో పేర్కొన్నారు. కొత్త సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న వేగంతోనే పారదర్శకత, జవాబుదారీతనం, అంతర్జాతీయంగా పంచుకోబడిన భద్రతా ప్రమాణాలను కూడా అమలు చేయాలని వారు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+