Visakhapatnam: విశాఖ-విజయనగరం-పలాస ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్లన్నీ..!

విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ఉత్తరాంధ్రలోని విజయనగరం, పలాసకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఇవాళ ఓ అలర్ట్ జారీ చేశారు. ఈ మూడు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లను సాంకేతిక కారణాలతో వివిధ తేదీల్లో రద్దు చేస్తున్నారు. ఏయే స్టేషన్ల మధ్య నడుపుతున్న రైళ్లను ఏయే తేదీల్లో రద్దు చేస్తున్నారో వివరిస్తూ దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని ఆయా స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.

విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

విశాఖపట్నం నుంచి విజయనగరంకు వెళ్లే మొమూ రైలు నంబర్ 67287ను ఈ నెల 15, 16, 23, 24,25 తేదీల్లో రద్దు చేస్తున్నారు.
అలాగే విజయనగరం నుంచి విశాఖకు వచ్చే మరో మెమూ రైలు నంబర్ 67288ను ఈ నెల 16, 17, 24, 25, 26 తేదీల్లో రద్దు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే మరో మెమూ రైలు నంబర్ 67289ని ఈనెల 16, 17, 24, 25, 26 తేదీల్లో రద్దు చేస్తున్నారు. అలాగే పలాస నుంచి విశాఖకు వచ్చే మరో మెమూ రైలు నంబర్ 67290ని ఈ నెల 15, 16, 23, 24, 25 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Visakhapatnam MEMU Train Services Cancelled on Select Dates Full List Here
Puri: పూరీ రథయాత్ర కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు- షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..!
Puri: పూరీ రథయాత్ర కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు- షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..!

కాబట్టి ఆయా స్టేషన్ల నుంచి ఈ తేదీల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో మినహా మిగిలిన తేదీల్లో మాత్రం ఈ మూడు స్టేషన్ల మధ్య రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులు అంతరాయానికి క్షమించాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+