ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బాహుబలి మూడో పార్ట్ ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బాహుబాలి పార్ట్ 3 గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచింది. ఈ చిత్రం రెండు పార్ట్‌లు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో బాహుబలి మూడో పార్ట్‌కూడా వుంటుందని చర్చలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత జ్ఞానవేలే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.
కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాహుబలి మూడో భాగంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో కేఈ జ్ఞానవేల్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన కంగువా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. 'గతవారమే బాహుబలి మూవీ మేకర్స్‌తో చర్చించాను. మూడో భాగం ప్లాన్ చేసే పనిలో ఉన్నాం. అయితే, ఆ సినిమా కన్నా ముందు రెండు సినిమాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మహేష్‌బాబు సినిమా..
బాహుబలి 3 గురించి ఇటీవలే దర్శకుడు రాజమౌళి కూడా మాట్లాడారు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు మూడోపార్ట్‌లో చూపించనున్నాం. దీనికి సంబంధించిన పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బాహుబలి 3 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కానీ, ఎప్పుడో ప్రస్తావించలేదు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌తో # SSMB29 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇందులో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీని తర్వాత ఆయన బాహుబలి మూడో పార్ట్ షూటింగ్ పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications