ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..త‌గ్గ‌నున్న కల్కి సినిమా టికెట్ ధరలు...

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి చిత్రం ఇటీవ‌లే విడుద‌ల‌య్యి భారీ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో కొన‌సాగుతున్న ఈ సినిమా రికార్డుల వ‌ర్షం కురిపిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 27వ తేదిన విడుద‌ల‌య్యింది. అయితే, త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ టిక్కెట్ రేట్లు సామాన్యుడికి అంద‌నంత స్థాయిలో ఉన్నాయి.

క‌ల్కి టిక్కెట్లు పెంచిన రేట్ల ప్ర‌కారం సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు, మల్టీప్లెక్స్ లో ఏకంగా 500 కు పైగా ఉంది. ఫ్యామిలీ మొత్తం క‌లిసి ఈ సినిమాకు వెళ్లాలంటే క‌ష్ట‌మే..! అందుకే, మ‌రికొద్దిరోజుల్లో ఈ టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఉన్న ధరల కంటే సాధార‌ణ ధ‌ర‌ల‌కే టిక్కెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Good news for Prabhas fans Kalki movie ticket prices to be reduced

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో మెచ్చిన చిత్రం క‌ల్కి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఎంద‌రో త‌మ న‌ట‌న‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. క‌ల్కి టిక్కెట్ రేట్ల‌పై మూవీ మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. కల్కి సినిమా టికెట్ ధరలు త‌గ్గించ‌బోతున్న‌ట్లు టాక్‌. ఈ వారం వరకు సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను బట్టి కల్కి టికెట్ ధరలను మల్టీప్లెక్స్ లో 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలు చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

టిక్కెట్ల రేట్లు త‌గ్గితే చాలామంది కుటుంబంతో క‌ల‌సి సినిమాను చూసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్నరేట్లతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి చూసే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న మూవీ మేక‌ర్స్ టికెట్ ధరలను తగ్గించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా ఎక్కువ‌సార్లు చూసే అవ‌కాశం కూడా ఉంటుంది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని, సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందించారు. ఇక, ఈ చిత్రంలో ప్ర‌భాస్ తోపాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ ఎంద‌రో న‌టించారు. వీరితో పాటు మ‌రెంద‌రో గెస్ట్ రోల్స్ కూడా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+