Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gunde Ninda Gudi Gantalu September 3rd: బాలు, సంజూ మధ్య మళ్లీ గొడవ.. పెళ్లిరోజు నాడే రచ్చ రంబోలా..

'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ 'స్టార్ మా'లో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2న ప్రసారమైన 501వ ఎపిసోడ్ లో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. మనోజ్ ఇంట్లో రోహిణి మీనా తరహాలో బస చేస్తుందేమోనని ప్రభావతి అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, ఇంట్లో వంట బాధ్యతను మీనాకే అప్పగించాలని ఆమె సూచించింది.

వ్యాపారాలు చేసేవారు నిత్యం తిరగాల్సి వస్తుందని, వారికి తగినంత శక్తి ఉండాలని, అందుకే వారు బాగా తినాలని ప్రభావతి పేర్కొంది. వంట చేసుకోవడానికి వారికి సమయం ఉండదని, కాబట్టి మీనానే వంట చేయాలని ఆమె తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు మీనా, బాలులకు ఆగ్రహం తెప్పించాయి. అక్కడే ఉన్న సత్యం కూడా అసహనం వ్యక్తం చేశాడు. బాలు వెంటనే జోక్యం చేసుకుని.. వ్యాపారం ఇంకా ప్రారంభం కాలేదని, అప్పుడే అంత బిజీ ఎలా అవుతారని ప్రశ్నించాడు. దీంతో బాలును మౌనంగా ఉండమని ప్రభావతి హెచ్చరించింది.

రోహిణికి ఇష్టమైన వంటకం చెబితే మీనా అదే వంట చేస్తుందని ప్రభావతి అనగా.. రోహిణి వెంటనే వెజిటబుల్ బిర్యానీ చేయమని చెప్పింది. అయితే, వంటగదిలో కూరగాయలు లేవని మీనా చెప్పింది. రోహిణి తాను తెప్పిస్తానని చెప్పింది. మనోజ్‌ ను కూరగాయలు తీసుకురావడానికి పంపించగా, అతను రూ.500 తీసుకుని ఒక్క రూపాయి లేకుండా తిరిగి వచ్చాడు. కిలో కూరగాయలకు రూ. 500 లా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంలో భాగంగా మనోజ్ వ్యాపార నైపుణ్యాలపై ప్రశ్నలు వచ్చాయి.

ఆ తర్వాత మీనా తల్లి ప్రభావతి ఇంటికి వచ్చింది. ఆమెను చూడగానే ప్రభావతి సూటిపోటి మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టింది. అనంతరం, సెప్టెంబర్ 3న ప్రసారమైన 502వ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. మీనా తల్లి పార్వతి ఇంటికి వచ్చినప్పుడు, తనకు చెప్పకుండా ఎందుకు వచ్చిందని మీనా మనసులో అనుకుంది. పార్వతి లోపలికి రాగానే, ప్రభావతి మీనాను కావాలని పిలిచి కాఫీ ఇవ్వమని చెప్పింది.

Gunde Ninda Gudi Gantalu Balu vs Sanju s Rambola Rumble on Wedding Day

కాఫీ తనకు అనుకుని పార్వతి "వదినమ్మా, ఇప్పుడు నేను తాగను" అంది. "నేను నీకు కాదు, నాకు కాఫీ చెప్పాను" అని ప్రభావతి షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఈ మాటలకు మీనా, సత్యం, పార్వతి అందరూ షాకయ్యారు. మీనా కోపంతో ప్రభావతిపై విరుచుకుపడి, అతిథులున్నప్పుడు వాళ్ల ముందే తాగడం మంచిది కాదని పేర్కొంది. "ఇప్పుడే తాగాల్సిన అవసరం లేదు, తర్వాత తాగొచ్చు" అని మీనా మొహం మీదే చెప్పింది. "ఇది నా ఇల్లు, ఇక్కడ నేను తాగుతాను. మీ ఇంట్లో ఏం తాగడం లేదు కదా" అని ప్రభావతి సమాధానం ఇచ్చింది.

ఇదే సమయంలో బాలు, రవి, శృతి, రోహిణి, మనోజ్ అందరూ హాలులోకి వచ్చారు. పార్వతి అందరినీ పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకుంది. అప్పుడు ప్రభావతి, "నువ్వు వచ్చిన పనేంటి?" అని పార్వతిని ప్రశ్నించింది. దానికి పార్వతి, బాలు, మీనా పెళ్లిరోజు ఉందని, దాన్ని తమ ఇంట్లో చేయించడానికి ఆహ్వానించడానికి వచ్చానని చెప్పింది. "పెళ్లి రోజు జరిపిస్తావా? ఓ 50 లక్షలు తెచ్చావా?" అని ప్రభావతి ఎటకారంగా అడిగింది. రోహిణి తండ్రి 40 లక్షలు పంపించాడని ప్రభావతి అనగా.. పార్వతి.. "రోహిణి తండ్రి జైల్లో ఉండి కూడా డబ్బులు పంపించడం గొప్ప విషయమే" అని సమాధానం ఇచ్చింది.

పెళ్లిరోజు నిర్వహిస్తామని, ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారా అని ప్రభావతి అడగ్గా.. తమకు అంత స్థోమత లేదని పార్వతి బదులిచ్చింది. "శృతి వాళ్ళ అమ్మానాన్న పెద్ద ఫంక్షన్‌లో చేశారు తెలుసా?" అని ప్రభావతి అనగా, "నీ కూతురికి ఎంత బంగారం పెడుతున్నావు?" అని ప్రశ్నించింది. ప్రభావతి మాటలతో విసిగిపోయిన పార్వతి, "మీరూ ఓ ఇంటికి మీ కూతురిని కోడలిగా పంపించారు కదా, మీరు ఎన్ని తులాల బంగారం పెట్టారని" తిరుగు ప్రశ్న వేసింది. దీంతో ప్రభావతి నోరు మూసుకుంది, సత్యం ఆమెకు బుద్ధి వచ్చిందని భావించాడు.

ఆ తర్వాత శృతి, మీనా తల్లి పార్వతితో మాట్లాడుతూ, తాను పంపిన జంతికలు చాలా బాగున్నాయని చెప్పింది. పార్వతి వెంటనే తన సంచిలోంచి అప్పాలు తీసి ఇచ్చింది. శృతి, రవి వాటిని తింటుండగా, ప్రభావతి " తినకండి, ఆమె ఏ నూనెతో చేసిందో తెలియదు కదా " అని అవమానించింది. " మంచి వంట నూనెతోనే వాడాను వదినా " అని చెప్పింది. అలాగే మనసు నొచ్చుకుని వెళ్లిపోయింది.

ఆ తర్వాత ప్రభావతి మీనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి విషయాలన్నీ తన తల్లికి ఎందుకు చెబుతున్నావని మండిపడింది. "జరిగిందే చెప్పాను, లేనిది ఏమీ చెప్పలేదు కదా" అని మీనా బదులిచ్చింది. ఇదే సమయంలో సుశీలమ్మ ఇంటికి వచ్చింది. ఆమె రాకతో సత్యం, బాలు, మీనా, రవి, శృతి అందరూ సంతోషించారు. బాలు, మీనా పెళ్లి రోజును గ్రాండ్‌ గా చేద్దామని సుశీలమ్మ అనగా, అందరూ సరేనన్నారు. ఇంట్లో అందరూ ఉన్నారని, మౌనికను కూడా పిలిస్తే బాగుంటుందని సుశీలమ్మ తెలిపింది.

అయితే, మీనా వద్దని అనగా.. "నా కూతురు రావడం నీకు ఇష్టం లేదా?" అని ప్రభావతి ప్రశ్నించింది. "అలా కాదు, బాలుకు సంజూకు పడదు కదా, మళ్లీ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉంటుంది "అని మీనా వివరణ ఇచ్చింది. తదుపరి ఎపిసోడ్‌ లో ఏం జరగనుంది అని సస్పెన్స్‌ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+