గుంటూరు కారం కలెక్షన్లలో 45 శాతం ఫేక్?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ప్రిన్స్ అభిమానులంతా నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమా త్రివిక్రమే తీశాడా? లేదంటే ఇంకెవరైనా తీశారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాదాసీదా సినిమా కావడంతోపాటు కనీసం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఒక్కటికూడా లేదు. కేవలం గుంటూరు కారం సినిమా కాస్తంత నిలబడిందంటే అది కేవలం మహేష్ బాబు ఛరిష్మామీదే అని చెప్పొచ్చు.

ఈసినిమాకు నిర్మాత నాగవంశీ తన వ్యాఖ్యలద్వారానే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. దాదాపు ఈ సినిమా 90 శాతం బ్రేక్ ఈవెన్ అయింది. వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తవుతుందన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశాడు. కొన్ని మీడియా సంస్థలు చెబుతున్న కలెక్షన్లలో నిజం లేదని, సినిమా చక్కగా రన్ అవుతోందంటూ ప్రకటించాడు.

guntur kaaram collections 45 percent fake

దీనికి సంబంధించిన వివాదం ఈ క్షణం వరకు కొనసాగుతూనే ఉంది. ఒక వెబ్ సైట్ కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో గుంటూరు కారం కలెక్షన్లు 45 శాతం ఫేక్ అని ఇచ్చారు. నువ్వు గుంటూరు కారం ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నావ్, నిర్మాతగా ఒరిజినల్ లెక్కలు తనదగ్గర ఉంటాయని, మిగిలినవారు చెప్పే నెంబర్లలో నిజం ఉండదని, నీ సోర్స్ చాలా తప్పని నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. సదరు వెబ్ సైట్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇచ్చి మీ కలెక్షన్స్ నిజం అని ప్రూవ్ చేయొచ్చు కదా అనడంతో నాగ వంశీ... మీరు అదే పాత పాట పడుతున్నారు. కలెక్షన్స్ ఫేక్ అనింది మీరు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆ వెబ్ సైట్ కు, నిర్మాతకు జరిగి వివాదం మెత్తబడింది. అయితే ఇంకా ముదురుతుందా? లేదంటే ఇంకేదైనా మలుపు తీసుకుంటుందా? అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+