Mahesh Babu: పార్టీ ఇచ్చిన రమణ గాడు
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలుత మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయి. మహేష్ స్టామీనాను చాటాయి.
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చి అతడు, ఖలేజా కంటే కూడా భారీ ఓపెనింగ్స్‌ను రికార్డ్ చేసింది గుంటూరు కారం. మహేష్‌కు మంచి పట్టు ఉన్న నైజాం ఏరియాలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలిరోజు- 16.09 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండో రోజు- 5.70 కోట్లు, మూడో రోజు- 5.82 కోట్లు, నాలుగో రోజున 6.90 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

నాలుగో రోజు కలెక్షన్లు భారీగా పెరగడం మహేష్ సత్తాకు అద్దం పట్టింది. ఏపీలో ఈ నాలుగు రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల మార్క్‌ను దాటాయి గుంటూరు కారం కలెక్షన్స్. వరల్డ్ వైడ్ బిజినెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 164 కోట్ల రూపాయలు.

ఈ మధ్యకాలంలో విడుదలైన మహేష్ బాబు అన్ని సినిమాలు కూడా ఈ రేంజ్‌లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్నాయి. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్‌వారి పాట.. ఇలా ఆయన నటించిన మూవీలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటోన్నాయి.. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ.

సిినిమా హ్యూజ్ సక్సెస్ అయిన జోష్‌లో ఉన్నారు మహేష్ బాబు. ఆదివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మహేష్ సన్నిహితుడు మెహర్ రమేష్.. తమ సకుటుంబ సపరివార సమేతంగా ఈ పార్టీకి హాజరయ్యారు. నేడు కూడా పార్టీ కంటిన్యూ కానుంది. టెక్నీషియన్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పార్టీ ఇవ్వనున్నారు మహేష్ బాబు.












Click it and Unblock the Notifications