బాక్సాఫీస్ ఘాటెక్కిపోద్ది: గుంటూరు కారం కొత్త టికెట్ల రేట్లు: జగన్‌కు విజ్ఞప్తి

Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. కోట్లల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

 Guntur Kaaram makers sent ticket rates hike proposals to the AP and Telangana govts

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్స్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారాయన. డాన్స్‌, ఫైట్స్‌లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

సర్కారువారి పాట బ్లాక్ బస్టర్, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. గడువు సమీపిస్తోండటంతో.. విడుదల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. థియేటర్లను ఇదివరకే బుక్ చేసుకున్నారు నిర్మాతలు. నైజాం ఏరియా హక్కులను మైత్రీ మూవీస్ సంస్థ దక్కించుకుంది.

 Guntur Kaaram makers sent ticket rates hike proposals to the AP and Telangana govts

ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడంపైనా నిర్మాతలు దృష్టి పెట్టారు. దీనిపై ఇదివరకే ప్రతిపాదనలు రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారు. ఏపీలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లల్లో టికెట్ ఒక్కింటిపై 75 రూపాయలు, తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లల్లో ఒక్కో టికెట్‌పై 65, మల్టీ ప్లెక్స్‌లల్లో 100 రూపాయల మేర పెంచుకోవడానికి అనుమతులను కోరారు.

అలాగే- విడుదల రోజైన ఈ నెల 12వ తేదీన అదనపు ఆటలను ప్రదర్శించుకోవడానికీ పర్మిషన్ తీసుకోనున్నారు. విడుదల రోజు మొదటి ఆటను అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకే ప్రదర్శించేలా ప్రతిపాదనలను రూపొందించారు నిర్మాతలు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+