గుంటూరు కారంపై దిల్ రాజు సెన్సేషనల్ రివ్యూ..
Guntur kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకాస్సేపట్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
గుంటూరు కారం ఫస్ట్ షో ఇంకోగంటలో పడబోతోంది. ఒంటిగంటకు తెలంగాణలోని పలు థియేటర్లల్లో బెనిఫిట్ షోను ప్రదర్శించనున్నారు ఎగ్జిబిటర్లు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్లగొండ, గద్వాల్ వంటి నగరాల్లో బెనిఫిట్ షో పడబోతోంది.

ఇప్పటికే ఆయా సినిమా హాళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు మహేష్ బాబు అభిమానులు. రచ్చ రచ్చ చేస్తోన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం సందడి సందడిగా మారింది. నెక్లెస్ రోడ్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్, కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్, గచ్చిబౌలిలోని ఏఎంబీ, భ్రమరాంబ, విశ్వనాథ్, గోకుల్ థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు.
ఈ సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తన రివ్యూ కూడా ఇచ్చారు. గురువారం ఉదయమే సినిమా చూశానని, మహేష్ బాబు కేరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు. మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కేరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సంక్రాతికి సరైన మూవీగా పడిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications