Hanuman: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‍ను కలిసిన హనుమాన్ టీమ్..
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ పడ్డ హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురించింది. పెద్ద సినిమాలతో హనుమాన్ మూవీకి థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. తెలుగులో చాలా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తర్వాత అనేక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనియ్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో హీరో, దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో లక్నోలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. హనుమాన్ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ యోగికి వివరించారు. హనుమాన్ సినిమా విజయం సాధించండపై యోగి ఆదిత్యనాథ్ మూవీ టీం అభినందించినట్లు తెలిసింది.

సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సినిమాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో యోగితో మాట్లాడినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.
ఆధ్యాత్మికతను ఇలా అర్థం చేసుకొనే ముఖ్యమంత్రి ఉండటం గ్రేట్ అని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు. యోగి జీని కలవడం నిజంగా తమకు ఒక గౌరవంగా ఉందని చిత్ర యూనిట్ చెప్పింది.
హనుమాన్ చిత్రం గురించి ముఖ్యమంత్రి చర్చించడం గర్వంగా ఉందని తేజ ఆనందం వ్యక్తం చేశారు.
కాగా హనుమాని మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు చేసింది. ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. హనుమాన్ టీం అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రతి టికెట్ పై రూ. 5 చొప్పున మొత్తం రూ.2.66 కోట్లను అయెధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. మరోవైపు ఈ చిత్రానికి సిక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. సిక్వెల్ ఓ స్టార్ హీరో నటిస్తారని ప్రశాంత్ వర్మ తెలిపారు.
-
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications