బాలయ్య పేరు నా దగ్గర ఎత్తొద్దు: కల్యాణ్‌రామ్

నందమూరి కుటుంబంలోని హీరోలకు, మెగా కుటుంబంలోని హీరోలకు ఒక తేడా ఉంది. మెగా కుటుంబంలోని హీరోలంతా (అల్లు అర్జున్ మినహా) ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమగా ఉంటారు. ఆప్యాయంగా కలిసివుంటారు. నందమూరి కుటుంబంలోని హీరోలు దీనికి విభిన్నంగా వ్యవహరిస్తారు. ఎంతమంది కథానాయకులున్నప్పటికీ నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వీరు ఎంతో సఖ్యతగా ఉండేవారు. అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సుదీర్ఘకాలం నుంచి వీరిమధ్య అసలు సంబంధాలే లేవని చెప్పొచ్చు.

వద్దని చెప్పిన కల్యాణ్ రామ్
నందమూరి హరికృష్ణ మరణం తర్వాత బాలయ్యకు, తారక్, కల్యాణ్ రామ్ కు దూరం బాగా పెరిగింది. కల్యాణ్ రామ్ గత చిత్రం డెవిల్ ద్వారా అభిషేక్ నామా దర్శకుడిగా పరిచయం అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు వేరేగా ఉన్నారు. ఆయన 80 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత అయిన అభిషేక్ నామాతో, కల్యాణ్ రామ్ తో విభేదాలు రావడంతో ఆయన పేరుకు బదులుగా అభిషేక్ నామా తన పేరు వేసుకున్నారు. డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్యను ముఖ్యఅతిథిగా పిలుద్దామని అభిషేక్ కల్యాణ్ రామ్ తో అన్నారు.

Hero Kalyan Ram warns Devil director Abhishek Nama not to mention Balakrishna name near him

పెరిగి పెద్దవైన విభేదాలు
దీనిపై కల్యాణ్ రామ్ అతనిపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం బాబాయ్ ను పిలవాల్సిన అవసరం లేదని, పిలిచినా రాడని, అతన్ని పిలవాలనే ఆలోచన పెట్టుకోవద్దని ఖరాఖండిగా చెప్పేశారు. దీనికి సంబంధించిన పాత వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాలయ్య చేసే సమయంలో వీరిమధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కాలక్రమేణా విభేదాలు పెరిగి పెద్దవయ్యాయి. వీటికితోడు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తారక్, కల్యాణ్ రామ్ స్పందించలేదు. ఇతర కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నారు. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వీరు హాజరయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం వీరిమధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాలను గమనించినట్లయితే భవిష్యత్తులో కూడా కలవడం కష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+