మహేష్‌బాబు ఇల్లు చూడండి.. మైండ్ బ్లోయింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు. అంటే డబ్బులోనే కాదు.. మంచి మనసులోను.. సేవా కార్యక్రమాలు చేయడంలోను, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునే విషయంలో కూడా నిజంగా శ్రీమంతుడే. ప్రతి ఏడాది రూ.30 నుంచి రూ.35 కోట్ల విలువ చేసే గుండె జబ్బుల ఆపరేషన్లను చిన్నారులకు చేయిస్తుంటాడు. తన స్వగ్రామం బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడితోనే ఆగిపోవడంలేదు.. ఆ గ్రామ ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫొటోలు
పద్మాలయ స్టూడియో కాకుండానే తనకు వందల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. తన భార్య నమ్రత తరఫున కూడా ఖరీదైన ఆస్తులు సమకూరాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల విలువ చేసే ఇంటిని ప్రిన్స్ నిర్మించారు. ఈ ఇల్లు చాలా బాగుంటుందని సోషల్ మీడియాలో తరుచుగా కామెంట్లు వస్తుంటాయి. ఉడెన్ ఫర్నిచర్, స్విమ్మింగ్ ఫూల్, డార్క్ వాల్స్ లాంటివి ఈ ఇంటికి ఎంతో శోభను తెచ్చిపెడుతుంటాయి. మహేష్ బాబు, నమ్రత తరుచుగా తమ ఇంటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు.

hero maheshbabu jubilee hills house cost and other details here

2028లో విడుదల కాబోతోంది
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రిన్స్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ పనిమీదే జక్కన్న దక్షిణాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకోబోతోంది. ఇది ఎన్ని భాగాలుగా రాబోతోంది అనే విషయమై స్పష్టత లేదు. మహేష్ బాబుకు మాత్రం ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 2028లో సినిమాను విడుదల చేయడానికి జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయనని చెప్పే మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ హీరో అయిపోతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

hero maheshbabu jubilee hills house cost and other details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+