వైసీపీ సర్కార్‌పై హీరో రామ్ సెటైర్లు..జగన్‌ను టార్గెట్ చేస్తూ డైలాగులు
ఏపీ ప్రభుత్వంపై మరోసారి సినీ ఇండస్ట్రీ సెటైర్లు వేసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా డైలాగులు వినిపించాయి. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో వైసీపీ ప్రభుత్వం గురించి పరొక్షంగా సీన్లు ,డైలాగులు తెర మీద దర్శనం ఇచ్చాయి. తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వం మీద సెటైర్లు వేసినట్టుగా తెలుస్తుంది. బోయపాటి శ్రీను - హీరో రామ్ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రం స్కంద. ఈ సినిమాలో కూడా ఏపీ ప్రభుత్వంపై సెటైరికల్‌గా కొన్ని డైలాగులు ఉన్నట్టు ప్రేక్షకులు చెబుతున్నారు.

ఓ సైడ్ క్యారెక్టర్ వచ్చి ఏంట్రా ఫారెన్ మందు ఎంత తాగిన ఎక్కడం లేదని అనగా.. దానికి బదులుగా అదే మా బుమ్ బుమ్ బ్రాండ్ అయితే ఇట్టే కిక్కు ఇస్తుంది తెలుసా అంటూ చెప్పిన డైలాగ్.. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పినట్టుగానే ఉందని అంటున్నారు. అలాగే హీరో రామ్ కూడా సీఎం గురించి ఓ సీన్లో చెప్పిన డైలాగులు జగన్‌ను టార్గెట్ చేసుకునే చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా బోయపాటి తన సినిమాల్లో వైసీపీ గురించి కొన్ని డైలాగులు రాశారు.

తాజాగా స్కంద సినిమాలో కూడా జగన్‌ను టార్గెట్ చేసుకుని పొలిటికల్ డైలాగులు పేల్చారాయన. ఇక హీరో రామ్ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రమేష్ హాస్పిటల్ అధినేత హీరో రామ్‌కు మావయ్య అవుతారు. కరోనా సమయంలో రమేష్ హాస్పిటల్‌ను జగన్ ప్రభుత్వం ఇబ్బందికి గురి చేసింది. ఆ సమయంలోనే ట్విట్టర్ వేదికగా హీరో రామ్ స్పందించారు. తాజాగా తన సినిమాలో జగన్ ఉద్దేశించి డైలాగులు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications