అంబానీ పెళ్లిలో రామ్ చరణ్ కు ఎంతిచ్చారో తెలుసా?

కొద్దిరోజుల నుంచి ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనపడుతున్నాయి. ఈనెల ఒకటి నుంచి మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకులకు ప్రపంచంలోని కుబేరులు, దేశంలోని రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ స్టార్స్, దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందడంతో తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు.

ఈ వేడుకల్లో ఖాన్ త్రయం షారుక్, అమీర్, సల్మాన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. వీరితోపాటు రామ్ చరణ్ కూడా జతకలిశారు. ఇంత హడావిడి చేసినందుకు ఖాన్ త్రయానికి అంబానీ బాగానే ముట్టచెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి వేడుకల్లో పాల్గొనేందుకు సెలబ్రిటీలకు ప్రత్యేక ఇన్విటేషన్ ఇస్తారంటారు. ఇలా హాజరుకావడానికి కోట్లాది రూపాయలు తీసుకుంటారనే వార్తలు వస్తుంటాయి.

hero ramcharan remuneration for anant ambani pre wedding

పాపులర్ పాప్ సింగర్ రిహాన్నే కు 54 కోట్ల నుంచి 63 కోట్ల రూపాయల వరకు అంబానీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఖాన్ల త్రయంతో పాటు చెర్రీ కూడా ఈ వేడుకల్లో ఇష్టపూర్వకంగానే పాల్గొన్నాడని, డబ్బు వారికి అవసరంలేదని, డబ్బు కోసం ఇదంతా చేయరంటూ కొందరు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. చెర్రీ సహజంగానే ధనవంతుడని, ఆయనకు డబ్బులు అవసరంలేదని, ఆయన సంపాదిస్తున్న సొమ్ములే కాకుండా తండ్రి చిరంజీవి వైపునుంచి, భార్య ఉపాసనవైపు నుంచి ఎంతో ధనం వచ్చిపడుతుంటుందని, కేవలం ఆహ్వానించారని, అలా వెళ్లి మిగతా సెలబ్రిటీలతో కలిసి సరదాగా స్టెప్పులేశారని, అనవసరంగా ఇటువంటి వివాదంలోకి చెర్రీని లాగవద్దని రామ్ చరణ్ అభిమానులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+