రవితేజ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ గురించి ప్రస్తుతం ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన యూత్ ఐకాన్ గా మారిపోయారు. సినీరంగంలో ఎదగాలి.. హీరోగా చేయాలి అనే ఉద్దేశంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ నచ్చావులే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో సహాయన నటుడిగా నటించాడుకానీ పేరు రాలేదు. తర్వాత నానితో కలిసి ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ పెళ్లిచూపులు సినిమాను తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రితూవర్మతో తీసింది. అప్పట్లో అది పెద్ద కమర్షియల్ హిట్ సినిమా నిలవడంతో విజయ్ కు మంచిరోజులు ప్రారంభమయ్యాయి.

అర్జున్ రెడ్డితో సంచలనం
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించి అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. వీటన్నింటికంటే ముందు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రవితేజ-నయనతార కాంబినేషన్ లో ఆంజనేయులు సినిమా వచ్చింది. అందులో ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని కనపడతాడు. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. దర్శకుడు ఓ సన్నివేశంలో విజయ్ ను చూపిస్తాడు. ఆంజనేయులుకు మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అయింది.

hero vijay devarakonda made a assistant director to ravi teja anjaneyulu movie

లైగర్ హిట్ అయ్యుంటే...
తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పరశురామ్ దర్శకత్వంలోనే గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యామిలీస్టార్ సినిమా వచ్చిందికానీ అది పరాజయం పాలైంది. లైగర్ సినిమా హిట్ అయ్యుంటే విజయ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు. దురదృష్టవశాత్తూ అది అట్టర్ ఫ్లాప్ అయింది. హీరోగా అతని యాటిట్యూడ్ కూడా ఇంటర్వ్యూలిచ్చే సమయంలో మీడియాకు, సినీ ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతోందంటున్నారు. వాస్తవానికి ఈ కథ రామ్ చరణ్ కోసం అనుకున్నాడు గౌతమ్. చివరకు విజయ్ దగ్గరకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+