2025లో తొలి బ్లాక్ బ్లాస్టర్ కొట్టిన హీరో
తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండగకు రిలీజయ్యే ఏ సినిమా అయినా మినిమమ్ గ్యారంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ "డాకు మహారాజ్", గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్", విక్టరీ వెంకటేశ్ "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వీటిల్లో "డాకు మహారాజ్","సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన "గేమ్ ఛేంజర్" మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.
ఒకసారి ఈ సినిమాలను కలెక్షన్లను పరిశీలిస్తే..గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటే, ఈ చిత్రం రెండో రోజుకే రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా, అభిమానులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. బాలకృష్ణ 'డాకు మహారాజ్' లుగో రోజున 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా రుజువు చేసింది.వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మూడవ రోజునే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

వెంకటేశ్ కెరీర్ లోనే ఇదొక గొప్ప ఫీట్‌గా చెప్పుకోవచ్చు. 2025లోనే "సంక్రాంతికి వస్తున్నాం" క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇది వెంకటేశ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్ల చిత్రంగా "సంక్రాంతికి వస్తున్నాం" నిలిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే బుకింగ్స్‌లో ఈ సినిమా మిగతా రెండు సినిమాల కంటే టాప్ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. ఓవర్సీస్‌లో కూడా "సంక్రాంతికి వస్తున్నాం" ఒక రికార్డ్ ను చేరుకుంది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న వెంకటేశ్ చిత్రంగా "సంక్రాంతికి వస్తున్నాం" రికార్డు సృష్టించింది.
మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ స్థాయిలో బుకింగ్స్ నమోడవ్వడం విశేషం. మూడో రోజుకు టోటల్ గా 29 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, వెంకటేశ్ సినిమాలలోనే వేగవంతమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి 2025లో తొలి బ్లాక్ బ్లాస్టర్ అందుకున్న హీరోగా విక్టరీ వెంకటేశ్ నిలిచారు.












Click it and Unblock the Notifications