ఆగ్రహంతో ఊగిపోయిన అనుపమ పరమేశ్వరన్
ఇటీవలికాలంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. ప్రధానంగా ఆమె బోల్డ్ పాత్రల్లో నటిస్తోందని, రెచ్చిపోయి నటిస్తోందంటూ ఆమె సొంత ఫ్యాన్సే మండిపడ్డారు. అనుపమ పరమేశ్వరన్ అభిమాని ఒకరు వీడియోను విడుదల చేశారు. నీకు చేతులెత్తి దండం పెడతానని, దయచేసి ఈ తరహా బోల్డ్ క్యారెక్టర్లు చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా అనుపమ నటించి టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ చూసినప్పుడు అంతా ఆమెది బోల్డ్ క్యారెక్టర్ అనుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత మాత్రం అందరి అభిప్రాయం మారిపోయింది. ఆమె క్యారెక్టర్ ఏమిటనే విషయం అర్థమైంది. సినిమా విడుదలయ్యాక అంతకుముందు వరకు ఉన్న క్యారెక్టర్ ను తప్పు పట్టిన అభిమానులు కూడా తర్వాత అనుపమ మంచి క్యారెక్టర్ చేసింది అంటూ కొనియాడుతున్నారు. సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రెస్ మీట్ పెట్టారు.

ఇన్నాళ్లు ఇలాంటి పాత్ర ఎందుకు చేయలేదని మీడియా ప్రతినిధులు అనుపమను ప్రశ్నించారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. తాను ముందుగానే చెప్పానని, బోల్డ్ క్యారెక్టర్ కాదని, పోస్టర్ చూసి మోసపోవద్దన్నారు. సినిమా చూసి మాట్లాడాలని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైందా? అని ప్రశ్నించారు.
ఈ పాత్రను వదులుకోకూడదని, తాను దీన్ని వదులుకుంటే కెరీర్ లో మంచి పాత్రను మిస్ చేసుకున్నదాన్ని అవుతానన్నాని గుర్తుచేశారు. తన పాత్రను ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స చెప్పారు. అంతేకాదు.. తర్వాత కూడా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications