ప్రెగ్నెంట్‌ అవ్వగానే భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.

తాజాగా ఓ హీరోయిన్ విడాకులు తీసుకుంది.ఇక్కడ విశేషం ఏమిటంటే..ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండగానే తన భర్తకు విడాకులిచ్చారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..మాళవిక సిత్లానీ. 2017 లో వచ్చిన 'మేరీ ప్యారీ బిందు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మాళవిక సిత్లానీ. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ప్రముఖ బిబినేస్ మ్యాన్‌ను పెళ్లాడింది. అయాన్ ఎనర్జీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అఖిల్ ఆర్యన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.

heroine got divorced while she was pregnant

2023 ఫిబ్రవరిలో, మాళవిక గర్భవతిగా ఉన్నప్పుడు ఈ కపుల్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగా గత ఏడాది మేలో మాళవిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది, ఆమెకు అబిగైల్ అని పేరు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన మాళవిక విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ..ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మా విషయంలో కూడా అదే జరిగింది. అలాగే మీకు ఇష్టమైన నటులు ఏ సమస్య లేకుండా ఉంటారు అని అనుకోకండి ప్రతి ఒక్కరి లైఫ్ ‌లో కష్ట సుఖాలు ఉంటాయి. అలాగే నా జీవితంలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాటి గురించి మాట్లాడాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+