ఆ పార్ట్ మీద టాటూ వేయించుకున్న నిహారిక
మెగా బ్యూటీ నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛగా తాను అనుకున్న రంగంలో విజయం సాధించేందుకు అడుగులు వేస్తోంది. ఫ్యాషన్ కు కట్టుబడి ఉండే నిహారిక నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తూ వస్తోంది. త్వరలోనే కమిటీ కుర్రాళ్లు పేరుతో తీసిని సినిమాను విడుదల చేయబోతోంది. తాజాగా ఆ సినిమాలోని ఎక్కడి గొర్రెలు అక్కడే అనే పాట మాత్రం ట్రోలింగ్ కు గురవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోతో నెగేటివిటి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నలుపు రంగు దుస్తుల్లో దర్శనమిచ్చిన బ్యూటీ.. 'హైలెట్ ఆఫ్ ద డే' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టింది. చేతిలో కాఫీ మగ్ పట్టుకొని ఉంది. ఈ ఫొటోను నటుడు ప్రియదర్శి తీశాడని చెప్పింది. మీరంతా కలిసి తాగుతారంటగా, మమ్మల్ని కూడా పిలుస్తారా? అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఫొటోలో టాటూ ప్రత్యేకంగా కనపడుతోంది. యాంకిల్ పై ఆకాశం నుంచి వర్షం కురుస్తున్నట్లుగా టాటూ బాగుందంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.

నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల వ్యవహారం తరుచుగా వార్తల్లో నిలవడమేకాదు.. నిహారికకు విపరీతమైన పాపులారిటీని కట్టబెట్టింది. ఓసారి మాత్రం యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి నిహారిక మాట్లాడింది. తాను ఎంతో బాధను అనుభవించానని, ఎన్నోసార్లు ఏడ్చానని, తాను ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టింది. నిహారిక చెప్పినదాన్ని చైతన్య ఖండిస్తున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడటం సరికాదని, రెండువైపులా ఆలోచించాలని ఒక పోస్ట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications