స్టార్ డైరెక్టర్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా హీరోయిన్‌గా మనీషా యాదవ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత అమ్మడుకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒరు కుప్పం కాదల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా దర్శకుడు శీను రామస్వామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావళ్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసి.. తర్వాత ఊహించనిరీతిలో ఆ సినిమా నుంచి తొలగించారు.
ఆమె సహకరించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేశారంటూ డైరెక్టర్ ఆరోపించారు. 'ఇదం పొరుల్ యావల్' సినిమా సమయంలో నటి మనీషా యాదవ్‌పై దర్శకుడు శీను రామస్వామి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో నందితా శ్వేత నటించారు. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా విడుదల కాలేదు.

ఇటీవలే ఆమె మరోసారి రామస్వామి చిత్రంలో నటించబోతోందంటూ వార్తలొచ్చాయి. దీనిపై మనీషా యాదవ్ స్పందించింది. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓ పాత్ర కోసం మనీషాను సంప్రదించారన్న ప్రశ్నకు ఆమె ఘాటుగా బదులిచ్చింది. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగినట్లు వెల్లడించింది. ఆ చిత్రంలో నటించనని మొహం మీదే చెప్పేసినట్లు తెలిపింది.
ఇదం పొరుల్ యేవల్ మూవీ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని, తప్పుడు ఉద్దేశంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ అతని కోరికలను అంగీకరించలేదని చెప్పింది. అందుకే తనను సినిమా నుంచి తప్పించారని, తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడని మనీషా యాదవ్ తెలిపింది. తాను పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల చిత్రాల్లో నటించాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications