ప్రభాస్ వల్ల నా జీవితానికి కోలుకోలేని దెబ్బ తగిలింది: నిత్యామీనన్

తెలుగు సినీ పరిశ్రమకు 'అలా మొదలైంది' సినిమాతో పరిచయం అయింది నిత్యామీనన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకరకంగా తన హావభావాలతో, కళ్లతో సినీ ప్రియులను కట్టిపడేసిందని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సూర్య, విజయ్ దేవరకొండ, నితిన్, శర్వానంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. చివరగా 'తిరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఎందుకో ఈ అమ్మడుకు బాగా గ్యాప్ వచ్చింది కానీ మళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చింది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది.

ప్రభాస్ ఎవరో తెలియదా?
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 'అలా మొదలైంది' సినిమా ప్రమోషన్స్ లో నిత్యామీనన్ ను ప్రభాస్ గురించి అడిగారు. అయితే తనకు ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పింది. ఆమె చెప్పిన సమాధానాన్ని, నిత్యాను దారుణంగా ట్రోల్ చేస్తూ తెలుగు సినీ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. నిత్యామీనన్ ఎక్కడికి వెళ్లినా మీడియావారు కూడా ఆమెను ఇదే విషయమై ప్రశ్నించేవారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ ఎవరో తెలియదా అంటూ అడిగేవారు.

heroine nithya menen comments on rebal star prabhas

అమాయకత్వంతో ఆడుకున్నారు
ఆమెకు బాగా పొగరు కాబట్టి అలా జవాబిచ్చిందని విమర్శలు వచ్చాయి. అయితే అసలు తనకు ఆ ఘటనతో ఏం జరిగిందో తెలియలేదని నిత్యా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అప్పుడు చాలా చిన్న వయసులో ఉన్నానని, సినిమాల గురించి పూర్తిగా అవగాహన లేదని, తెలుగు సినిమాలు చూడలేదని, చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉంటారనే విషయం కూడా తెలియదంది. అందుకే ప్రభాస్ గురించి అడగ్గానే తెలియదని చెప్పానని, అయితే తానేదో పాపం చేసినట్లు అందరూ మానసికంగా వేధించారని, తన జీవితంలో బలంగా తగిలిన ఎదురుదెబ్బ అదేనని, ఆ తర్వాత తాను చాలా నేర్చుకున్నట్లు నిత్య తెలిపింది. ప్రతిచోటా నిజాయితీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని, తన అమాయకత్వంతో అందరూ ఆడుకున్నారని వాపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+