4 రోజులు వాడుకొని వదిలేశారు: ప్రభాస్‌పై మండిపడ్డ రకుల్

తెలుగులో టాప్ హీరోయిన్‌గా స్టార్‌డం కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినీ పరిశ్రమకు 2011లో పరిచయమైంది. తన మొదటి సినిమా కన్నడంలో నటించింది. ఆ సినిమా పేరు గిల్లీ. అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి కెరటం, కరెంటుతీగ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా మంచి పేరు తీసుకురావడమే కాకుండా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు, రామ్ చరణ్ తో ధ్రువ లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయింది.

మాటమాత్రం కూడా చెప్పలేదు
వాస్తవానికి రకుల్ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ మొదటి షెడ్యూల్ లో తన షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లింది. ఈలోగా ఆ సినిమాలోకి రకుల్ ప్రీత్ బదులుగా మరో హీరోయిన్ వచ్చింది. ఆ సినిమాకు తనకు ఎంతో బ్రేక్ నిస్తుందని భావించానని, అయితే తనకు కనీసం మాటమాత్రం కూడా చెప్పకుండా ఆ సినిమా నుంచి తొలగించారని వాపోయింది. నాలుగురోజు షూటింగ్ చేసిన తర్వాత ఇలా చేయడం ఎంతవరకు సబబు అని, తాను ఎంతో ఆవేదన అనుభవించానంటూ హీరో ప్రభాస్ తోపాటు ఆ సినిమా నిర్మాత దిల్ రాజుపై కూడా మండిపడింది.

heroine rakul preet singh slams hero prabhas and producer dil raju

మరీ బక్కపల్చగా ఉంది
ఆ సినిమా పేరు మిస్టర్ పర్‌ఫెక్ట్. రకుల్ ప్రీత్ సింగ్ ను తొలగించడంపై ఒకసారి దిల్ రాజు కూడా వివరణ ఇచ్చారు. కొన్నిరోజులు షూటింగ్ జరిగిన తర్వాత రషెస్ చూస్తూ ప్రభాస్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ మరీ బక్కపల్చగా కనిపించిందని, దీంతో కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ప్రభాస్ అప్పటికే తాను డార్లింగ్ సినిమా కాజల్ తో చేశానన్నాడని, అయితే ఈ సినిమాలో కథకు కీలకం అంతా కథానాయికే కాబట్టి బాగుంటుందని చెప్పడంతో ప్రభాస్ ఒప్పుకున్నాడన్నారు. రకుల్ ప్రీత్ ను తొలగించినందుకు తనకు కూడా ఎంతో బాధేసిందని, కానీ సినిమా బాగా రావడం అనేదే ప్రధానమని దిల్ రాజు ఆ సందర్భంలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+