సాయిధరమ్‌తేజ్‌తో బ్రేకప్.. సందీప్ కిషన్‌తో పెళ్లి?
హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ ను వివాహం చేసుకోబోతోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని వీరిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనసులో శ్రుతి సినిమాద్వారా తెలుగు సినీ పరిశ్రమకు రెజీనా పరిచయమైంది. ఆ తర్వాత నగరం, రారా కృష్ణయ్య, రొటీన్ లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో సందీప్ కిషన్ సరసన నటించింది. వెండితెరపై వీరి జంటను చూసివారంతా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని చర్చించుకున్నారు. ఆ రేంజ్ లో వారిద్దరూ కెమిస్ట్రీని పండించారు.
ఏనాడూ గొడవ పడలేదు
ఈ సినిమాల తర్వాత సాయిధరమ్ తేజ్ తో కలిసి సుబ్రమణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం, నక్షత్రం సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో నటించే సమయంలోనే వీరిద్దరిమీద అనేక రూమర్లు వచ్చాయి. తాజాగా రెజీనా నటిస్తున్న ఉత్సవం సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో ముచ్చటించింది. సాయిధరమ్ తేజ్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, కోపం ఉండదని, చాలా కూల్ అని, తనకు మంచి స్నేహితుడని, తామిద్దరం ఏనాడూ గొడవపడలేదని చెప్పింది.

అలాగే సందీప్ కిషన్ తో తన రిలేషన్ వేరు అంది. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ ఇద్దరం గొడవ పడుతూనే ఉంటామంది అయినా ఎప్పుడూ కలిసే ఉంటామని, తనకు సందీప్ కిషన్ తో పెళ్లి అయిందని, సాయిధరమ్ తేజ్ తో బ్రేకప్ అయిందని చాలాసార్లు వార్తలు వచ్చాయని రెజీనా చెప్పింది.
ఇప్పటికే ఆరుసార్లు పెళ్లయింది
నారా రోహిత్ తో బాలకృష్ణుడు, శంకర, జో అచ్యుతానంద సినిమాల్లో నటించానని, అయినా తామిద్దరి రిలేషన్ గురించి ఎటువంటి రూమర్లు రాకపోవడం విశేషమని చెప్పింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారమైతే తనకు ఇప్పటికే అరడజనుసార్లు వివాహం అయ్యుండాలని, తనకు వచ్చేవాడు ఇలా ఉండాలని, అలా ఉండాలని తాను ఏనాడూ ఏమీ అనుకోలేదని చెప్పింది. చాలాసార్లు రిలేషన్ లోకి వెళ్లానంది. తనను సీరియల్ డేటర్ అనొచ్చు అని చెప్పింది. ప్రస్తుతానికి మాత్రం తాను ఖాళీగా ఉన్నానని రెజీనా వ్యాఖ్యానించింది. రెజీనా నటించిన ఉత్సవం సినిమా ఈనెల 13న విడుదలైంది. తమిళంలో అజిత్ తో కలిసి విడాముయాచీ చేస్తోంది.












Click it and Unblock the Notifications