హీరోయిన్‌గా తొలి సినిమానే బ్లాక్‌బస్టర్... ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్
సినిమా పరిశ్రమ అన్న తర్వాత ఎంతోమంది నటులు, నటీమణులు వస్తుంటారు.. పోతుంటారు.. కొందరు మాత్రం దశాబ్దాలపాటు కొనసాగుతుంటారు. మరికొందరు మాత్రం నాలుగైదు సంవత్సరాలకే కనుమరుగవుతుంటారు. పరిశ్రమ అన్న తర్వాత ఇది సహజంగా జరిగే పరిణామం. అలాగే హీరోయిన్లు కూడా ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. అలాగే తాను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయరుగా రాణిస్తోంది.
ఈరోజుల్లో బ్లాక్ బస్టర్
వెంకటేష్, తిష జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో త్రిష పక్కన స్నేహితురాలిగా నటించింది రేష్మా రాథోడ్. ఆ సినిమాలో అందరూ త్రిషకన్నా ఆమెనే ఎక్కువగా చూశారు. బాడీగార్డ్ తర్వాత ఈరోజుల్లో సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలి పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయికానీ ఈరోజుల్లో అందించినంత విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం వంటి చిత్రాల్లో నటించింది. విజయాలు అందకపోతుండటంతో 2017 తర్వాత రేష్మా పూర్తిగా నటనకు దూరమైంది.

సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి
ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారతీయ జనతాపార్టీలో చేరింది. పార్టీలో మంచిపేరు తెచ్చుకోవడంతోపాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసింది. సినీరంగం తర్వాత రాజకీయ రంగంలో, న్యాయవాద రంగంలో మంచిపేరు తెచ్చుకుంది. తాజాగా జులై నెలలో రేష్మా రాథోడ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా పదోన్నతి పొందింది. సోషల్ మీడియాలో మొదటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే రేష్మా రాథోడ్ తాజాగా తన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థలో లాయరుగా ఎదగడం అంటే సాధారణ విషయం కాదని, సినిమా పరిశ్రమ లాంటి ఆకర్షణీయమైన పరిశ్రమ నుంచి బయటపడటం కూడా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రేష్మారాథోడ్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. బీజేపీ తరఫున కేసులు వాదిస్తారా? పేదల తరఫున కేసులు వాదిస్తారా? సుప్రీంకోర్టు వరకు రాలేని పేదలకు న్యాయం చేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications