ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్ లో సమంత

దేశవ్యాప్తంగా ఉన్న హీరోయిన్లలో ఓటీటీకి సంబంధించి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఎవరో తెలుసా? ఈ జాబితాలో దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ లాంటివారనుకుంటున్నారా?... కాదు కాదు స్టార్ హీరోయిన్ సమంత అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి OTT ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ప్రస్తుతం చిన్న బడ్జెట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. వెబ్ సిరీస్ లైతే అన్ని భాషల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిద్వారా నటీనటులకు ఆదాయ వనరులు పెరిగాయి. కొందరు సెలబ్రిటీలు ఓటీటీల కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వీరిలో మన తెలుగు వారికి బాగా దగ్గరైన సమంత ఓటీటీ పారితోషికం విషయంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.

heroine Samantha in number one place in India

సమంత ఒక్కో షోకు రూ.10 కోట్లు తీసుకుంటోంది. ది ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ తో ఓటీటీల్లోకి అరంగ్రేటం చేసింది. దీనికోసం రూ.4 కోట్లు తీసుకుంది. మరోసారి రాజ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ ఇండియా సిరీస్ చేయబోతోంది. సియాసత్ డాట్ కామ్ నివేదిక ప్రకారం సిటాడెల్ ఇండియా సిరీస్‌కు సమంత రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఓటీటీల్లో రాధికా ఆప్టే రూ.4కోట్లు, రసిక దుగ్గల్ రూ.2 లక్షలు, సుస్మితాసేన్ ఒక్కో షోకి రూ.2కోట్లు, శోభితా ధూళిపాళ్ల రూ.2 కోట్లు తీసుకుంటున్నారు. కష్టాలను అనుభవించినప్పుడు కేవలం ఒక్క పూట మాత్రమే తినాన్నని చెప్పిన సమంత ప్రస్తుతం రూ.కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. మయోసైటిస్ తో ప్రస్తుతం షూటింగ్ లకు విరామం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+