ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న సమంత ఫొటోలు
ప్రస్తుతం దేశంలోని టాప్-10 కథానాయికల్లో సమంత ఒకరు. తెలుగులో స్టార్ కథానాయికగా కొనసాగుతున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిలో ఈమె కూడా ఒకరు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. అయితే అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసివస్తోంది ఈ అమ్మడుకు. అప్పట్లో ఒప్పుకున్న సినిమాలకు సంబంధించి తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగిచ్చేసింది. ఇప్పుడు సినిమాలు చేద్దామంటే హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకు రావడంలేదు.
దీంతో ఈ అమ్మడు ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోయినట్లుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగచైతన్యపై కామెంట్స్ చేసిందికానీ నాగచైతన్య మాత్రం ఎప్పుడూ వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదనే విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత చేసిన పుష్ప సినిమాలో ని పాటలో వల్గర్ గా నటించడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఎవరిమీద కోపం ఎవరిమీద చూపిస్తోందంటూ అభిమానులు చర్చించుకున్నారు.

ప్రస్తుతం బ్లాక్ కలర్ సూట్ ధరించి దిగిన ఫొటోలను షేర్ చేసింది. అలాగే ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది. '' డిస్నీ ప్రిన్సెస్‌గా ఓడిపోయాను. కానీ నేను ఇప్పుడు డ్రాగన్'' అంటూ రాసుకొచ్చింది. సమంతకు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తోంది? అంటూ కామెంట్లు పెడుతుండటమేకాదు.. ఫైర్ ఎమోజీలను కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మమ్ముట్టితో ప్రస్తుతం ఓ సినిమా ఒప్పుకుందని తెలుస్తోంది. వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఆదాయాన్ని ఆర్జించడంతోపాటు ఓ నిర్మాణ సంస్థను కూడా సమంత ప్రారంభించింది. దీనిద్వారా టాలెంట్ ఉన్న యువతను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. త్వరలోనే సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లను నిర్మించబోతోంది.












Click it and Unblock the Notifications