ప్లీజ్ ఆపండి.. 'దేవర' సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని మొదటి పార్ట్ గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ . థియేటర్ల దగ్గర అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్‌గా రూ. 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. మూడు రోజులు కలిపి ఈ సినిమా రూ.304 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. చాలా చోట్ల థియేటర్ అద్దాలు, పగులగొట్టడం, ప్రమాదవశాత్తు సుదర్శన్ థియేటర్‌లో 'దేవర' ఫ్లెక్లీ కాలిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అభిమానుల దెబ్బకు 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిదంటే వాళ్లు ఎంత వైలెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా ఎన్టీఆర్ అభిమానుల గురించి హీరోయిన్ వేదిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఓ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేకను బలి ఇవ్వడ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వేదిక రియాక్ట్ అవుతూ.. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి. చూస్తేనే భయంకరంగా ఉంది ఆ అమాయకపు మూగజీవి ఏం చేసింది?. నా హృదయం కలిచివేస్తోంది. అభిమానం పేరిట నోరు లేని మూగజీవిని బలివ్వడం ఏంటి? ఒకరు కాళ్లు పట్టుకుని లాగుతున్నారు, మరొకరు తలపట్టుకున్నారు. ఇంకొకరు తల నరికేశారు. ఆ తలతో పోస్టర్‌కు అభిషేకం చేశారు జంతు బలి ఎవరూ అభినందించరుఆ నోరులేని మూగజీవి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతున్నాను. ఇలాంటివి మళ్లీ పునరావృతంగా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాని ఆమె పోస్టు పెట్టారు. ఈ వీడియోను జంతువులను సంరక్షించే 'పెటా'ను కూడా ఆమె ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే.. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఇదే. విపరీతమైన నెగిటివిటీని తట్టుకుని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. రెగ్యులర్ ఆడియోన్స్, ఫ్యామిలీ ఆడియోన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, దసరా సెలవులు ఉండటంతో 'దేవర' ఈజీగా రూ. 800 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రెడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు.












Click it and Unblock the Notifications