బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు హైకోర్టు నోటీసులు...
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజెపి ఎంపీ కంగన రనౌత్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బాలీవుడ్ నటి కంగనా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు ప్రసుత్తం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 21 వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు కోరింది.
మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను 74వేలకుపైగా ఓట్ల తేడాతో కంగనా రనౌత్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే, మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టేశారని, కిన్నౌర్ నివాసం లాయక్ రామ్ నేగి ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్‌ను అనర్హులరాలిగా ప్రకటించాలని లాయక్ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇక, ఈ విషయంపై విచారణ జరిపిన హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆగస్టు 21లోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ను ఆదేశించింది.

వచ్చే నెల 21లోపు వివరణ..
ఈ సందర్భంగా లాయక్ రామ్ నేగి మాట్లాడుతూ...తాను గతంలో అటవీ విభాగంలో విధులు నిర్వర్తించానని, అయితే నామినేషన్ దాఖలు చేసే ముందుగా ఉద్యోగానికి ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్లు నేగి దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే, నేను నామినేషన్ పత్రాలతోపాటే డిపార్ట్ మెంట్ నుంచి పొందిన నో డ్యూ సర్టిఫికెట్‌ను కూడా జతచేశాను. కరెంట్, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించారని లాయక్ నేగి తెలిపారు. అందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారని, ఆ గడువులోపు తాను అన్నీ తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి సమర్పించానని తెలిపారు. కానీ, అధికారులు వాటిని తీసుకోలేదు సరికదా.. తన నామినేషన్ తిరస్కరించారని లాయక్ రామ్ నేగి పిటీషన్ లో పేర్కొన్నాడు. నామినేషన్ పత్రాలు అంగీకరించి ఉంటే తాను మండీ నియోజకవర్గం నుంచి గెలిచేవాడినని రామ్ నేగి తన పిటీషన్‌లో వివరించారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని లాయక్ కోర్టును కోరారు. లాయక్ దాఖలు చేసిన పిటీషన్ పై వచ్చే నెల 21వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కంగనాకు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications