రాజమౌళిపై ఫైర్ అవుతున్న హిందూ సంఘాలు.. అలా అన్నారేంటి !
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో విశేషంగా 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈవెంట్ సందర్భంగా రాజమౌళి తన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకున్నారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉన్నాడు. అందుకే ఈ సినిమా చేస్తున్నాడు అని ఒకసారి పేర్కొన్నారు. ఇది ప్రస్తావిస్తూ రాజమౌళి, "టెక్నికల్ సమస్యల వల్ల గ్లింప్స్ ఆలస్యమైనప్పుడు... నాకు దేవుడిపై అంత నమ్మకం లేదు. మా నాన్న 'హనుమంతుడు నీ వెనుక ఉన్నాడు' అని అన్నప్పుడు కోపం వచ్చింది. ఇది నడిపించేదేనా అనిపించింది" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పట్ల హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నెటిజన్లు కూడా రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా చిన్న సమస్యకు దేవుడిని అనవసరంగా లాగడం ఎందుకు?".. "హనుమంతుడిని అవమానించే హక్కు ఎవరికీ లేదు" అని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం #RespectHanuman అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు అభిమానులు రాజమౌళి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదని, హనుమంతుడిపై ఆరాధన తగ్గించడం లక్ష్యం కాదని కూడా వాదిస్తున్నారు. అయినా కూడా సోషల్ మీడియాలో వివాదం చెలరేగినట్టే కొనసాగుతోంది.
ఇక వారణాసి చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు ₹1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన ఏ చిత్రానికైనా ఇది అత్యధిక బడ్జెట్‌గా పరిశ్రమలో భారీ చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు ఈ చిత్రంలో 'రుద్ర' పాత్రలో నటిస్తున్నారు. ఎద్దుపై కూర్చుని రుద్ర శక్తితో ముందుకు దూసుకెళ్తున్న గ్లింప్స్ ఈవెంట్‌లో విడుదల కాగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఫస్ట్ లుక్‌లో చీర కట్టులో గన్ పట్టుకుని యాక్షన్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలానే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన 'కుంభ' అనే పాత్రలో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications