మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లకు ఇండస్ట్రీ హిట్‌లను ఇచ్చిన ఏకైక హీరోయిన్
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌లు కొనసాగుతున్నారు. వీరి నుంచి సినిమాల వస్తుంటే చాలు అభిమానులకు పునకాలు వస్తాయి.ముగ్గురు కూడా స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు.అలాంటి హీరోలకు ఓ హీరోయిన్ ఇండస్ట్రీ హిట్‌లను ఇచ్చింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఈ ముగ్గురు హీరోలకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హీరోయిన్ ఎ ఎవరైన ఉన్నారా అంటే భూమిక.
భూమిక మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి, 2000వ సంవత్సరంలో తెలుగు చిత్రం 'యువకుడు'తో నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చాలాకాలం ఆమె తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో సైతం నటించి మెప్పిచింది.

అయితే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు భూమిక అదృష్ట హీరోయిన్‌గా మారింది. ఈ ముగ్గురు హీరోలకు భూమిక ఇండస్ట్రీ హిట్‌లను ఇచ్చింది. పవన్ కల్యాణ్‌తో 'ఖుషి', మహేష్ బాబు 'ఒక్కడు', ఎన్టీఆర్‌తో 'సింహాద్రి' సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి.
ఖుషి (2001)
ఖుషి ఒక కొత్త తరహా ప్రేమకథతో వచ్చి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజమ్స్ యువతను ఎంతగానో ప్రభావితం చేశాయి. సినిమాలోని "చీర" సన్నివేశం, హీరోయిన్ భూమికతో అతని కెమిస్ట్రీ ఇప్పటికీ ఒక ట్రెండ్‌సెట్టర్. ఈ సినిమా కేవలం పాటలు, రొమాంటిక్ సన్నివేశాలతోనే కాకుండా, హీరో-హీరోయిన్ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ప్రేమను వర్ణించిన తీరుకు చాలా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రంగా ఇది నిలిచిపోయింది.

ఒక్కడు (2003)
ఒక్కడు మహేష్ బాబును ఒక యాక్షన్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా. అప్పటివరకు లవర్ బాయ్‌గా ఉన్న మహేష్, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో ఒబుల్ రెడ్డిగా తన నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఈ సినిమా క్లాసిక్ పాటలు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, మరియు మహేష్-భూమికల కెమిస్ట్రీతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
సింహాద్రి (2003)
సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక మైలురాయి. కేవలం 20 ఏళ్ల వయసులో, ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు వేర్వేరు పాత్రల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక సాధారణ మాస్ సినిమా కాదు, భావోద్వేగాల ప్రవాహం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఎన్టీఆర్ చూపించిన ఉగ్రరూపం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు, బలమైన కథాంశం, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీ హిట్గా చరిత్ర సృష్టించింది. ఇది రాజమౌళి, ఎన్టీఆర్‌ల కలయికకు బలమైన పునాది వేసింది.












Click it and Unblock the Notifications