హృతిక్ vs ఎన్టీఆర్.. 'వార్ 2'లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్?

War 2: హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్ 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం మరింత ఉత్సుకతను రేపుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ఈ సంవత్సరంలోనే భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 'వార్ 2' ట్రైలర్ జులై 25న విడుదలైనప్పటి నుంచి ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బలమైన పోటీని చూపిస్తూ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా యాక్షన్ విజువల్స్‌తో నిండి ఉంటుందని తెలుస్తోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 'వార్ 2' కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, భారీ పెట్టుబడితో కూడిన చిత్రం. అయితే ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం.

Hrithik Roshan vs Jr NTR Who Earns More for War 2 The Salary Revelation

నటీనటుల పారితోషికాల వివరాలు ఇలా..

జూనియర్ ఎన్టీఆర్: 'ఆర్ఆర్ఆర్', 'దేవర పార్ట్ 1' అద్భుతమైన విజయాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం 'వార్ 2' కోసం రూ. 60 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నట్లు 'టైమ్స్ నౌ' నివేదించింది. దీంతో ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా ఆయన నిలిచారు. విలన్ పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆయనకు హీరో హృతిక్ రోషన్ కంటే ఎక్కువ పారితోషికం లభించడం విశేషం.

హృతిక్ రోషన్: 'వార్ 2'లో రా ఏజెంట్ కబీర్ ధాలివాల్ పాత్ర కోసం హృతిక్ రోషన్‌కు రూ. 48 కోట్ల పారితోషికం లభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రధాన పాత్ర అయినప్పటికీ ఆయన పారితోషికం జూనియర్ ఎన్టీఆర్ కంటే తక్కువగా ఉంది.

కియారా అద్వానీ: ట్రైలర్‌లో తన బోల్డ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన కియారా అద్వానీకి రూ. 15 కోట్ల పారితోషికం లభించింది.

దర్శకుడు అయాన్ ముఖర్జీ పారితోషికం
'వార్ 2' అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన నాలుగో చిత్రం. గతంలో ఆయన 'వేక్ అప్ సిడ్', 'యే జవానీ హై దీవానీ', 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ' వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. అయాన్ ప్రస్తుతం పరిశ్రమలో అత్యంత పేరున్న దర్శకులలో ఒకరు, తన విభిన్న కథనం, ప్రత్యేక దర్శకత్వ శైలికి ప్రసిద్ధి చెందారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ 'వార్ 2' దర్శకత్వం కోసం అయాన్ ముఖర్జీ రూ. 32 కోట్ల పారితోషికం తీసుకున్నారు.

'వార్ 2' రిలీజ్ డేట్
'వార్ 2' సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగం. ఈ యూనివర్స్‌లో ఇప్పటికే సల్మాన్ ఖాన్ 'టైగర్', షారుఖ్ ఖాన్ 'పఠాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఉన్నాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్,కియారా అద్వానీ నటించిన 'వార్ 2' చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+