నాగ చైతన్యతో చేసిన ఆ సినిమా ఇబ్బందిగా అనిపించింది ..సమంత షాకింగ్ కామెంట్స్
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు.నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.అయితే నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఏమాయ చేశావే సినిమాతోనే సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చించిందనే విషయం తెలిసిందే.
తాజాగా సమంత తన తొలి సినిమాపై రియాక్ట్ అయ్యారు."ఏమాయ చేశావే" సినిమాలో నా నటన చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఆమె కామెంట్ చేసింది. నేను అంతకంటే బాగా యాక్ట్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా యాక్టింగ్ నాకే నచ్చలేదని ఈ భామ తెలిపింది. సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి "శుభం" అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఈ కామెంట్స్ చేసింది. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications