నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి.. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ కామెంట్స్ !
ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. రేణు దేశాయ్, పవన్.. బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకోగా.. అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. పవన్ తో విడాకుల తర్వాత ఒంటరి గానే ఉంటున్న ఆమె.. రెండేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై నోరు విప్పారు. ఆమె మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనిపించింది.. కానీ నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని అన్నారు. తనకు, పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని వర్ణించారు. వ్యక్తిగతంగా చూస్తే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండాలి.. నాకు పెళ్లి కావాలి.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది. కానీ నేను పిల్లల కోణం నుంచి ఆలోచిస్తే ఇది సాధ్యం కాదు అని వ్యాఖ్యానించారు.

అయితే అంతకు ముందు ఆవిడ తన చేతికి రింగ్ తో మరో వ్యక్తి తన జీవితంలోకి రాబోతున్నారంటూ పోస్ట్ పెట్టారు. దాంతో ఆవిడ త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. అయితే ఆ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఏం మాట్లాడక పోవడంతో ఇన్నాళ్లు ఈ విషయం సైలెంట్ గా ఉంది. అంతే కాకుండా పాడ్‌కాస్ట్‌లో తానా పొలిటికల్ ఎంట్రీ గురించి, అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు.
ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్తూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని.. దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
అకీరా సినిమాల్లోకి ఎంట్రీ గురించి కూడా ఆమె నోరు విప్పారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారని.. రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందన్ని జోరుగా ప్రచారం జరుగుతోంది. అవన్నీ వాస్తవాలు కాదని.. ఇప్పటికే తాను చాలా సార్లు చెప్పానని తేల్చారు. అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా తానే ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు.
అప్పటి వరకు ఈ తరహా రూమర్లను ఆపాలని కోరారు. ఒక తల్లిగా తన కొడుకును బిగ్ స్క్రీన్ పై చూడాలని అందరికంటే ఎక్కువగా తనకే ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడూ తనని ఫోర్స్ చేయనని.. ఏది చేయాలనిపిస్తే అదే చేయమని చెబుతానని తెలిపారు.












Click it and Unblock the Notifications