ఐ బొమ్మలో కొత్త సినిమాలు వచ్చాయి!
ప్రస్తుత రోజుల్లో థియేటర్ కు లేదంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూడాలంటే కనీసం ఇద్దరు వ్యక్తులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ఖర్చు అవుతున్నాయి. అది కూడా జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటేనే. సినిమా టికెట్ కన్నా క్యాంటిన్ లో తినుబండారాల ధరలతోనే ప్రజలను దోచేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం అలా చూస్తూనే ఉంటాయి. సరే.. అది వేరే విషయం. ఈ ఖర్చులకు దడిచి థియేటర్లకు వెళ్లడం ప్రజలు తగ్గించారు. ఓటీటీలు అందుబాటులోకి రావడంతోపాటు థర్డ్ పార్టీ వెబ్ సైట్ లు కూడా ఉండటంతో థియేటర్లకు వెళ్లడం తగ్గింది.
ఏపీ, తెలంగాణలో ఎక్కువ మంది ప్రజలు చూసే వెబ్ సైట్ గా ఐబొమ్మ ప్రథమ స్థానంలో నిలిచింది. ఓటీటీల్లో విడుదలైన సినిమాలను నిముషాల వ్యవధిలోనే ఐబొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు విడుదలవుతున్న సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లను కూడా అందిస్తోంది. ఈ వారం ఓటీటీలు విడుదల చేసిన సినిమాలు, సిరీస్ లు ఐబొమ్మలో అందుబాటులోకి వచ్చాయి.

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన నా సామిరంగ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఐబొమ్మలోకి వచ్చింది. అలాగే రూ.15 కోట్లతో నిర్మితమై రూ.304 కోట్ల సంచలన వసూళ్లు సాధించిన సంచలన చిత్రం ది కేరళ స్టోరీ కూడా తాజాగా ఐబొమ్మలోకి వచ్చింది. విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి రావడంతో వెంటనే ఐబొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన భామాకలాపం మొదటి భాగం అద్భుత విజయాన్ని అందుకుంది. భామాకలాపం2 కు కూడా మంచిపేరు వచ్చింది. ఇది కూడా ఐబొమ్మలో సిద్ధంగా ఉంది. వీటితోపాటు వాలెంటైన్స్ నైట్, గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, బబుల్ గమ్ తదితర చిత్రాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications