Lava నుంచి Smart 4 Plus లాంచ్.. కేవలం రూ.9,999కే మాత్రమే !

స్మార్ట్‌ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. కాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో స్వదేశీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది "లావా". లేటెస్ట్ గా ఇప్పుడు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన 'స్మార్ట్' సిరీస్‌లో భాగంగా కొత్త Lava Smart 4 Plus 4G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఇటీవల Bold N2ను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు రూ.10 వేల లోపు ధరలో పెద్ద డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 15 Go ఎడిషన్, 5000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో రోజువారీ అవసరాలకు సరిపోయే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను రూపొందించింది. అంతే కాకుండా ఈ ఫోన్‌పై ఒక సంవత్సరం వారంటీతో పాటు Lava ప్రత్యేకంగా ఉచిత Home Service సదుపాయాన్ని కూడా అందిస్తోంది.

lava-newly-launched-smart-4-plus-4g-that-price-and-specifications-along-with-availability-and-warran

Lava Smart 4 Plus 4G ఫీచర్స్..

డిస్‌ ప్లే..

Lava Smart 4 Plusలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్క్రోలింగ్‌ను మరింత స్మూత్‌గా మార్చడంతో పాటు వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాసులు, వెబ్ బ్రౌజింగ్ వంటి పనులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. పెద్ద డిస్‌ప్లే కారణంగా కంటెంట్ వీక్షణ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రాసెసర్..

పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో UNISOC 9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి 4GB ఫిజికల్ RAM అందించగా, అదనంగా 4GB వర్చువల్ RAM ఎక్స్‌పాంషన్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో మొత్తం 8GB వరకు RAM అనుభవాన్ని పొందవచ్చు. రోజువారీ యాప్‌లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, సాధారణ మల్టీటాస్కింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించవచ్చు.

స్టోరేజ్..

ఈ ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఫోటోలు, వీడియోలు, యాప్‌ల కోసం ఇది సరిపోతుంది. అవసరమైతే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.

పనితీరు..

Lava Smart 4 Plus తాజా Android 15 Go Edition ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. తక్కువ RAM ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెర్షన్ వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ వినియోగం, సాఫీ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే తాజా భద్రతా అప్‌డేట్లు కూడా లభిస్తాయి.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు AI సపోర్ట్ ఉన్న సెకండరీ కెమెరాను అందించారు. HDR, Portrait Mode, Night Mode వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు ఈ కెమెరా సెటప్ సరిపోతుంది.

5000mAh బ్యాటరీ..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. 10W ఛార్జింగ్‌కు మద్దతుతో పాటు USB Type-C పోర్ట్‌ను కూడా అందించారు.

భద్రత & కనెక్టివిటీ ఫీచర్లు..

Lava Smart 4 Plusలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు Face Unlock సపోర్ట్ కూడా ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, స్పీకర్, Bluetooth, Wi-Fi, GPS వంటి అవసరమైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. డ్యూయల్ 4G VoLTE SIM సపోర్ట్ కూడా లభిస్తుంది.

డిజైన్ & రంగులు..

ఈ స్మార్ట్‌ఫోన్‌ను Nilgiri Blue, Himalayan Silver అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ చేశారు. స్లిమ్ డిజైన్, ప్రీమియం ఫినిష్‌తో బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తుంది.

ధర & లభ్యత..

Lava Smart 4 Plus ధరను రూ.9,999గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ స్కీమ్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+