మా తాత లేకపోతే బాపట్లలో పంక్చర్లు వేసుకునేవాడివి.. నాగబాబుకు అల్లు అర్జున్ కౌంటర్?
మెగా కుటుంబంలో విభేదాలు రోజుకోరకంగా రచ్చకెక్కుతున్నాయి. పిఠాపురం వచ్చి పవన్ కల్యాణ్ కు మద్దతివ్వకుండా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చినందుకు అల్లు అర్జున్ పై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే...! అని ఆ ట్వీట్ లో ఉంది. నంద్యాల వెళ్లడానికి ముందురోజు బన్నీ పవన్ కల్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి అంతటితో సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టతనిచ్చారు.
సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడివి
తాజాగా అల్లు అర్జున్ ట్విటర్ ఖాతా తెరవగానే ఒక ట్వీట్ కనిపిస్తోంది. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బన్నీ అభిమానులు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేసివుంటే బాగుండేదని, తీరా అయిపోయిన తర్వాత ఇలా చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తలలు పట్టుకున్న మెగా అభిమానులు
అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా? లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా? లేదంటే బన్నీ కౌంటర్ వేయాలని ఇలా చేశాడా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాల్లో ఎందులోను స్పష్టత లేకపోవడంతో అభిమానులు తలల పట్టుకు కూర్చుంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. బన్నీ ఈ ట్వీట్ చేయలేదు.. ఎవరో ఎడిట్ చేసి పెట్టారంటున్నారు. అందులో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు.












Click it and Unblock the Notifications