'పుష్ప2' తర్వాత ఆ డైరెక్టర్ తో బన్నీ సినిమా

తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న స్టార్ కథానాయకులంతా పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిపోయారు. వారు తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రూపొందుతోంది. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారంతా గ్లోబల్ ఇమేజ్ పొందారు.

మొదట నటించిన సినిమా హిట్ అయితే దాని తర్వాత విడుదలయ్యే సినిమా అంతకు మించి మూడురెట్లు ఎక్కువగా ఉండాలి అని ఆలోచించే అల్లు అర్జున్ ప్రస్తుతం తనకు క్రేజీ హిట్ ఇచ్చే డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ తో పుష్ప2 తర్వాత బన్నీ సినిమా చేయబోతున్నాడు. అనుకోకుండా హఠాత్తుగా వీరి మధ్యలోకి మరో వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరో కాదు.. జైలర్ తో సన్సేషనల్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్.

icon star allu arjun next movie director nelson dilipkumar

బన్నీకి అదిరిపోయే కథను వినిపించగా దీన్ని వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడి, అతని దగ్గరనుంచి అనుమతి తీసుకున్న తర్వాత బన్నీ దీన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా తర్వాత అలాంటి హిట్ పడాలి అంటే నెల్సన్ దిలీప్ లాంటి డైరెక్టర్ అయితే బాగుంటుందని భావించిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను హోల్డ్ లో పెట్టారు. పుష్ప2 పూర్తయిన తర్వాత దీన్ని తెరకెక్కించబోతున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. అన్నీ సరిగ్గా కుదిరితే పుష్ప స్థాయిలో మరో పాన్ ఇండియా హిట్ ను బన్నీ సొంతం చేసుకుంటాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+