అవినీతిపరుడికి, అరాచకవాదికి అండగా నిలిచిన అల్లు అర్జున్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతోపాటు వీఎఫ్ఎక్స్ పనులపై దర్శకుడు సుకుమార్ రాజీపడకపోతుండటంతో వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి బడ్జెట్ రూ.400 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తోంది. విడుదల వాయిదా పడుతుందా? అనే విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టతను నిర్మాతలు ఇవ్వడంలేదు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ
అల్లు అర్జున్ ఇటీవలే ముగిసిన ఏపీ ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన రవిచంద్రకిషోర్ రెడ్డికి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. తన చిన మామయ్య పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తున్నప్పటికీ ఆయనకు మద్దతివ్వడం అనేది ఒక ట్వీట్ తో సరిపెట్టేసిన బన్నీ రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్లారు. అక్కడ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించడంతోపాటు కిషోర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు.

ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి
రవిచంద్ర కిషోర్ రెడ్డికి బన్నీ ఏవిధంగా మద్దతిచ్చారని ఆయన అభిమానులే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిషోర్ రెడ్డి చేసిన అరాచక పనులపై ఒక్కో విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోవడంతో ఈ విషయాలేవీ బయటకు వచ్చేవికావుగా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇటీవలి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీగా పనిచేసిన సి.మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైన్యాధ్యక్షుడిలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
తీవ్రమవుతున్న విమర్శలు
దీనికి ముందు మహేశ్వర్ రెడ్డి నంద్యాలలో పనిచేశారు. అక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి, ఆయన కుటుంబీకుల కనుసన్నల్లో చిత్తం మహాప్రభూ అనేరీతిలో విధులు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాష్టీకాలకు, దాడులకు దగ్గరుండి కొమ్ముకాశారని, వైసీపీ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారని చెబుతున్నారు. అటువంటి వ్యక్తికి అల్లు అర్జున్ మద్దతు పలకడంపై ఇప్పుడిప్పుడే విమర్శలు తీవ్రమవుతున్నాయి.












Click it and Unblock the Notifications