వీళ్లు సినిమా హీరోలా? శవాలాను పీక్కుతినే రాబందులా?

సినిమా హీరో అంటే సమాజానికి సందేశం ఇవ్వాలి. తన అభిమానులను మంచిమార్గంలో నడిపించాలి. నలుగురికి ఆదర్శంగా నిలిచి ఇతరులను కూడా ఆదర్శవంతమైన మార్గంలో నడిపించేలా ఉండాలి. గతంలో తెలుగు హీరోలుగా ఉన్న నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, హరనాథ్, కాంతారావు, రామకృష్ణ, సావిత్రి, భానుమతి, కృష్ణకుమారి ... ఇలా ఎందరో హీరోలు, హీరోయిన్లు ఈ మార్గంలోనే పయనించారు. వీరివల్ల ఎంతోమంది నిర్మాతలు గుండెలమీద చేయి వేసుకొని సినిమాలు తీసేవారు. నాలుగు డబ్బులు కళ్లచూసేవారు. కానీ ఇప్పుడున్న తెలుగు స్టార్ హీరోలు మాత్రం నిర్మాతలు కళ్ల చూడకుండానే వాటిని లాగేసుకుంటున్నారు. ఎలాగంటే..

కళను కళగా చూడకుండా డబ్బు రాబడిగానే చూస్తున్నారు
సినిమాల్లో పారితోషికం తీసుకోవడం అనేది గతంలో ఉన్న పద్ధతి. ఇప్పుడున్న హీరోలు కేవలం కమర్షియల్ గా తయారయ్యారు. కేవలం వారికి డబ్బే ప్రదానం. డబ్బు కోసమే వారు కళారంగాన్ని వాడుకుంటున్నారు. చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. దీనికి పారితోషికంగా రూ.75 కోట్లు తీసుకుంటున్నారు. తన కుమార్తె సుస్మిత పేరుమీద ఉన్న బ్యానరును ఈ సినిమాకు యాడ్ చేస్తున్నారు. అందుకు అదనంగా మరో రూ.10 కోట్లు తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటే నిర్మాతకు ఏం మిగులుతుందో వారికే తెలియాలి. అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమా చేసినప్పుడు పారితోషికంతోపాటు లాభాల్లో వాటా తీసుకున్నారు. దానికి గీత ఆర్ట్స్ బ్యానరును యాడ్ చేశారు. హీరోలకు, దర్శకులకే ఇంత డబ్బు పోతుంటే నిర్మాతకు ఏం మిగులుతుంది? వారికి ఏం లాభాలు వస్తాయంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

If 75 percent of the film budget goes to the hero and director how much is left for the producer

ప్రాంతాలవారీగా హక్కులు కూడా..
జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతి సినిమాకు పారితోషికంతోపాటు అదనంగా కల్యాణ్ రామ్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ను యాడ్ చేస్తారు. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పారితోషికంతోపాటు తన బ్యానరును యాడ్ చేసి అదనంగా డబ్బు తీసుకుంటున్నారు. వీళ్లు సినిమా హీరోలా? లేదంటే శవాలను పీక్కుతినే రాబందులా? అంటూ తెలుగు ఫిలింనగర్ లో ఒకటే చర్చ నడుస్తోంది. రామ్ చరణ్, ప్రభాస్ లాంటి నటులు మాత్రం కేవలం పారితోషికంతో సరిపెట్టేస్తారు. లాభాల్లో వాటాలు, నైజాం హక్కులు అంటూ వాటిని పట్టించుకోరు. ఇది మంచి పద్దతి. మహేష్ బాబు గతంలో తాను చేసే సినిమాలకు తన అన్నయ్య, చెల్లెలు, అక్కయ్య పేర్లను యాడ్ చేసేవారు. అదనంగా కొంత సొమ్ములు తీసుకునేవారు. ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి పలికారు. పారితోషికం తీసుకుంటున్నారు. రాజమౌళితో చేసే సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా లాభాల్లో వాటాలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ కూడా ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.

హీరోలను మించిన దర్శకులు
హీరోలను మించిపోయారు మన దర్శకులు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు కూడా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. వీటికి పారితోషికం అదనం. ఇలా హీరోలు, దర్శకులు నిర్మాతమీద పడి పీక్కుతింటుంటే వాళ్లు ఎలా బతకాలి? సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతతోపాటు ఆ సినిమాను కొన్న బయ్యర్ల పరిస్థితి ఏమిటి? అనేది వీరు ఆలోచించరా? అని అభిమానులు మండిపడుతున్నారు. క్రమేణా హీరోలమీద అభిమానులకు ప్రేమ తగ్గిపోతూ వస్తోంది. కేవలం వారు కూడా సినిమాను సినిమాగానే చూసి వదిలేస్తున్నారు. వీరికోసం గుడ్డలు చించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+