ఆ స్టార్ హీరోయిన్ నేపాల్ మాజీ ప్రధాని మనవరాలు అని తెలుసా..?
సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా.. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1970 ఆగస్టు 16న నేపాల్‌లో జన్మించింది. ఆమె తాత బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా 1959-60 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి. ఆమె తండ్రి ప్రకాశ్ కొయిరాలా కూడా 2005-06 మధ్య నేపాల్‌లో మంత్రిగా పనిచేశారు. చిన్న వయసు నుంచే కళలపై ఆసక్తి చూపిన మనీషా, చివరకు సినిమాల వైపు అడుగుపెట్టింది.
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ..
1991లో విడుదలైన హిందీ చిత్రం సౌదాగర్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. హిందీలో 1942: ఎ లవ్ స్టోరీ, గుప్త్ , దిల్ సే , ఖామోషి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అలానే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన క్రిమినల్ (1994) సినిమాలోని 'తెలుసా మనసా' పాటతో మనీషా కొయిరాలా తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

అదే తరహాలో అర్జున్ తో "ఒకే ఒక్కడు", సూపర్ స్టార్ రజినీ కాంత్ తో "బాబా" , అరవింద్ స్వామితో "బొంబాయి" , కమల్ హాసన్ తో "భారతీయుడు" సినిమాల్లో తన నటనతో తెలుగు, తమిళ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. తెలుగు, తమిళ సినిమాలు చేసినప్పటికీ మనీషా ఎక్కువగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
అయితే మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉండేది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఏకంగా 12 మందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో శేఖర్ కపూర్, నానా పటేకర్, సచిన్ టెండూల్కర్, అరవింద్ స్వామి వంటి పలువురితో ఆమె రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషితో కూడా ఆమె సంబంధాలపై రూమర్స్ వచ్చాయి. తరచూ ప్రేమ వ్యవహారాలతో మీడియాలో నిలిచిన మనీషా చివరకు 2010లో నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఎక్కువకాలం నిలవలేదు. కొద్దికాలానికే వారు విడాకులు తీసుకున్నారు.

క్యాన్సర్ పోరాటం..
కాగా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే మనీషా క్యాన్సర్ బారిన పడింది. 2012లో ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. అమెరికాలో దీర్ఘకాలిక చికిత్స పొందుతూ ధైర్యంగా పోరాడింది. చివరికి క్యాన్సర్‌పై గెలిచి తిరిగి జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. ఈ పోరాటం వల్ల ఆమె అనేక మందికి ప్రేరణగా నిలిచింది.
మరోవైపు క్యాన్సర్ నుంచి బయటపడి తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఈ నేపాలీ భామ. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్లో మల్లికాజాన్ పాత్రలో తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకుంది. ఈ పాత్రకు గాను ఆమెకు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డు లభించడం విశేషం.
-
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications