సాయి పల్లవి దెబ్బకు భార్యలకు విడాకులిచ్చిన ఇద్దరు హీరోలు

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మొదటి సినిమా నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇక సాయి పల్లవి డ్యాన్స్‌కు అయితే ప్రత్యేక అభిమాన గణమే ఉందని చెప్పాలి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

interesting news goes viral of Heroine sai pallavi

ఇక హద్దులు దాటే గ్లామర్ షోకు సైతం సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదే సాయి పల్లవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టంది. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి పల్లవి ఎవరితో సినిమా చేస్తే ఆ హీరో తన భార్యకు విడాకులు తీసుకుంటున్నారని ఈ వార్త సారాంశం.

సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్‌స్టోరీ అనే సినిమాలో నటించింది. లవ్ స్టోరీ సినిమాలో నటించిన తరువాత నాగచైతన్య-సమంతకు విడాకులు ఇచ్చేశాడు. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం సాయి పల్లవితో నటించిన తరువాత తన భార్యకు విడాకులు ఇచ్చారు. మారి 2 సినిమాలో నటించిన తరువాత ధనుష్ తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేశాడు.

దీంతో సాయి పల్లవి ఏ హీరోతో చేసిన అతను తన భార్యకు విడాకులు ఇస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ఓ సినిమా చేస్తోంది. విడాకులు ఫార్ములా వర్కౌట్ అయితే ఇండస్ట్రీలో నెక్ట్స్ విడాకులు తీసుకునేది రణ్‌బీర్ కపూర్‌ -అలియా జంటే అని జనాలు ఓ రేంజ్‌లో సాయి పల్లవి ని ట్రోల్ చేస్తున్నారు. మరీ తనపై వస్తోన్న ఈ విమర్శలకు సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+