సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పాలనుకోవడం కూడా తప్పా?
ఈరోజుల్లో సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పాలనుకోవడం కూడా తప్పై పోతుంది. అదేమంటే.. అందులో కూడా విపరీత అర్థాలు తీసి గొడవ చేయడంతోపాటు వివాదాన్ని సృష్టిస్తున్నారు. దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ మాట్లాడిన మాటలు మంచివే. అయితే రెండు పదాలను ఉపయోగించడం మాత్రం సరైంది కాదు. దీనిపై అతను క్షమాపణలు కూడా కోరాడు. మంచి విషయం చెప్పేటప్పుడు దాన్ని వ్యక్తం చేసే భాష, భావం కూడా అంతే అందంగా ఉండాలి. అయితే శివాజీ పొరపాటున వాడిన రెండు పదాల్లో కూడా లోతుగా ఆలోచిస్తే అసభ్యత కనపడదు. ఎందుకంటే పురుషులు పైకి మహిళలను, వారి దుస్తులను చూస్తున్నా లోపల మనసులో మాత్రం ఏమనుకుంటారు అనే విషయాన్నే చెప్పాడు. అసభ్యకరంగా చెప్పకుండా మరో పదం వాడాడు. వాస్తవానికి పురుషులు చెప్పాలంటే చాలా దారుణంగా చెబుతారు.. మాట్లాడుకుంటారు. కానీ అది వేదిక కాబట్టి ఆ స్టైల్ లో చెప్పలేదు శివాజీ.
సినీ రంగంలో మహిళలకు మంచి గౌరవం దక్కుతోంది
అబ్బో.. దీనికే అనసూయ, చిన్మయితోపాటు మరికొందరు రెచ్చిపోయారు. అనసూయకు, శివాజీకి గతంలో జబర్దస్త్ చేసే సమయంలో కావొచ్చు.. లేదంటే మరో విషయంలో కావొచ్చు ఉన్న విభేదాలను ఈ సంఘటనకు వాడుకుంది. ఈమె నిధి అగర్వాల్ దుస్తులు చించేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? చిన్మయి కూడా దీనిపై ఎందుకు మాట్లాడలేదు.. ఇప్పుడు నోరు తెరిచి గోల చేస్తున్నవారంతా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే వీరి దగ్గర సమాధానం లేదు. శివాజీ మాట్లాడిన విషయంపై మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారు. మహిళా హక్కులు, మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు. వారికి అంత గౌరవం లభిస్తేనేకదా సినీ రంగంలో కొనసాగుతున్నారు. శివాజీ మాట్లాడే సమయంలో కూడా ఇలా అనుకుంటారమ్మా.. అలా అనుకుంటారమ్మా అంటూ పద్ధతిగా చెప్పారుకానీ పద్ధతి లేకుండా చెప్పలేదు.

గోళ్లు గిల్లుకుంటున్నవారంతా రాద్ధాంతం చేస్తున్నారు
పనీపాట లేనివారంతా, ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నవారంతా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పడం కూడా తప్పైతే రేపు భవిష్యత్తులో ఏదైనా మంచి చెబుదామనుకున్నా మనకెందుకులే అని ఊరుకుంటారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేవారు, బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టేవారు ఉన్నంతకాలం సమాజం ఇలాగే ఉంటుంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు, పురుషులు 95 శాతం మంది శివాజీ వ్యాఖ్యలనే సమర్థిస్తున్నారు.. అతనికే మద్దతు పలుకుతున్నారు. ఎక్కువ శాతం మంది ప్రజలు ఉపయోగించని సోషల్ మీడియాలో మాత్రం సెలబ్రిటీలని చెప్పుకునేవారంతా రాద్ధాంతం చేస్తున్నారు. శివాజీపై అనసూయ విరుచుకుపడిన తర్వాతే స్విమ్ సూట్ ఫొటోలు విడుదల చేసింది. రోబోలో కిల్లి మంజారో పాటలో ఎన్నో ద్వంద్వార్థాలున్నాయి. వాటిని చిన్మయి ఎలా పాడింది. అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ లో శివాజీకి మద్దతే వస్తుందికానీ ఒక్కరు కూడా వ్యతిరేకించడం లేదంటే లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది శివాజీని విమర్శించినప్పటికీ ఎందుకు వీరిద్దరు అధికంగా స్పందిస్తున్నారంటే దానికి ఇతరత్రా కారణాలున్నాయి. వీరికి తోడుగా నాగబాబు రంగ ప్రవేశం చేశారు. ఏదేమైనప్పటికీ మనం మాత్రం ఎటువంటి సమాజంలో ఉన్నామో కూడా అర్థం కావడంలేదని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications