EL Nino: ఎల్ నినో ముప్పులో ఏపీ-సర్కార్ కీలక ఆదేశాలు-కంట్రోల్ రూమ్ ..!

ఏపీలో ఎల్ నినో (El Nino) ప్రభావం తీవ్రంగానే ఉంది. వర్షాలు అడపాదడపా పడటం మినహా రెగ్యులర్ వర్షపాతం కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Govt) రంగంలోకి దిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో రైతుల్ని ఎల్ నినో బారి నుంచి రక్షించడం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు సహా పలు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో వర్షపాత లోటు 53.7 శాతంగా ఉందని, మొత్తం 28 జిల్లాల్లో 21 జిల్లాలు 'వర్షపాతం లోటు' కేటగిరీలో ఉన్నాయని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి, అన్నమయ్య, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఆరు జిల్లాలు 'తీవ్ర వర్షపాతం లోటు' కేటగిరీలో ఉన్నాయని, నెల్లూరు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

AP Govt Alerts Officials Over El Nino Threat to Farmers Orders 24x7 Control Room

మొదటి దశలో జూలై 31 నాటికి ప్రధానంగా అనంతపురం, కర్నూలు, మార్కాపురం ప్రాంతాల్లోని 1.78 లక్షల హెక్టార్లకు 26,950 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని, రెండో దశలో ఆగస్టు 15 నాటికి 21 జిల్లాల్లోని 429 మండలాల్లో 4.78 లక్షల హెక్టార్లకు అదనంగా 95,838 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని తెలిపారు. కాబట్టి వాటిని సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కాలువ చివరి ప్రాంతాలు, తేమ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. దీర్ఘకాలిక వరి రకాల నుంచి ఇతర ప్రత్యామ్నాయ పంటలకు మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రత్యేక రైతు సూచనలను విస్తృతంగా తెలియజేయడానికి ఐసీసీ హెల్ప్‌లైన్ 155251, టెలివిజన్, రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఐవీఆర్‌ఎస్/ ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత రైతు సమాచార ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం, ఉపగ్రహ సమాచారం, నీటి లభ్యత, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమీకరించే విధంగా 24×7 రాష్ట్ర ఎల్‌నినో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+